రెబెల్ స్టార్ ప్రభాస్ 22వ సినిమా “ఆది పురుష్” టైటిల్ పోస్టర్ విడుదల

రెబెల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే తన అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాథే శ్యామ్ గా అతి త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్న ప్రభాస్ ఆ వెంటనే ప్రభాస్ 21వ చిత్రంతో కూడా అలరించబోతున్నారు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రభాస్ తన 22వ సినిమాకి సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా ప్రకటించారు. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఓం రౌత్(తానాజీ ఫేమ్) దర్సకత్వం లో మైతిలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రానికి “ఆది పురుష్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఓం రౌత్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

బ్యాక్ టూ బ్యాక్ ఎంటర్టైన్మెంట్

అభిమానులకి తను మాటిచ్చిన రీతిలోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. ఐతే తాను పోషించే ప్రతి క్యారెక్టర్ ని ఛాలెంజ్ గా తీసుకొని ఫాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రభాస్ ఆది పురుష్ కోసం మరింతగా శ్రమించి తన పాత్రను రక్తి కట్టించే రీతిన రెడీ అవుతున్నారు. ఈ ఎపిక్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఫాన్స్ ని అత్యంతగా ఆకట్టుకోవడం ఖాయం అని అది పురుష్ టీం చెబుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ కి తెలుగులోనే కాదు యావత్ ప్రపంచం ఇప్పుడు అభిమానులు ఉన్నారు. నార్త్ లో ప్రభాస్ యాక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ మోత మోగిస్తుంది. అందుకే ప్రభాస్ తో ప్రతి సినిమాను పాన్ ఇండియా రంజిలోనే తెరకెక్కించాడనికి ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం నార్త్ లోనే కాదు నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా ప్రభాస్ క్రెజ్ కి సాటి మారేది లేదు. బాహుబలి సిరీస్, సాహో, రాథే శ్యామ్, ప్రభాస్ 21సినిమాలు మాదిరిగానే ప్రభాస్ 22 ఆది పురుష్ ను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి వివిధ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

ఎపిక్ డ్రామాకి వియఫ్ఎక్స్ హంగులు

సాహో, రాథే శ్యామ్ తరువాత వరసగా మూడో సారి ప్రముఖ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టి సిరీస్ తో కలిసి పని చేస్తున్నారు ప్రభాస్. ఆది పురుష్ ఓ ఎపిక్ డ్రామాగా గ్రాఫిక్స్ హంగులతో రెడీ అవ్వబోతున్నట్లుగా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తెలిపారు.

టెక్నికల్ డీటెయిల్స్

బ్యానర్ : టి సిరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫైల్స్ ప్రొడక్షన్స్
సమర్పణ : గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్
నిర్మాతలు : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్
డైరెక్షన్ : ఓం రౌత్

Related posts

Leave a Comment