“ప్ర‌ణ‌వం” సినిమా రివ్యూ

Pranavam Movie

బేన‌ర్ః చ‌రిత అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్
న‌టీన‌టులుః శ్రీ మంగం, శశాంక్‌, జెమిని సురేష్‌, అవంతిక‌, గాయ‌త్రి అయ్య‌ర్‌
నిర్మాతః త‌ను ఎస్‌
ద‌ర్శ‌క‌త్వంః కుమార్ జి
సంగీతంః ప‌ద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్‌
ఎడిటర్‌: సంతోష్‌
ఫైట్స్‌: దేవరాజ్‌
రిలీజ్ డేట్ః 05-02-2021

చాలా గ్యాప్ త‌ర్వాత శ్రీ మంగం హీరోగా న‌టించిన చిత్రం ప్ర‌ణ‌వం. ల‌వ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా కుమార్. జి అనే నూత‌న ద‌ర్శ‌కుడు ప‌రిచ‌య‌మ‌య్యారు. త‌ను ఎస్ నిర్మాత‌గా తొలి చిత్రం. శ‌శాంక్ , జెమిని సురేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. టైటిల్ తో పాటు పోస్ట‌ర్స్ , సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ రోజు విడుద‌లైంది. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

స్టోరి విష‌యానికొస్తే..
కార్తిక్ (శ్రీ మంగం) , జాను ( అవంతిక‌) తొలి చూపులోనే ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌తారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. హ్యాపీగా సాగిపోతున్న వీరి లైఫ్ లోకి అనుకోకుండా ఓ అమ్మాయి ఎంట‌ర్ అవుతుంది. ఇంత‌లో జాను మిస్స‌వుతుంది. జాను మిస్సింగ్ కేసు భ‌ర్త కార్తిక్ పైకి వ‌స్తుంది. అస‌లు వీరి మ‌ధ్య‌లోకి వ‌చ్చిన ఆ అమ్మాయి ఎవ‌రు? జాను ఎలా మిస్స‌యింది? హీరో శ్రీ వీట‌న్నింటినీ ఎంలా చేధించాడు అన్న‌ది మిగ‌తా క‌థాంశం.
న‌టీన‌టులు ప‌ర్ఫార్మెన్స్ః
ఫేమ‌స్ ఫ్యాష‌న్ ఫొటోగ్రాప‌ర్ గా , ప్లే బాయ్ గా శ్రీ అద్భుతంగా న‌టించాడు. అలాగే ఒక భ‌ర్త గా చాలా మెచ్యూర్డ్ గా న‌టించాడు. శ్రీ లో మున‌ప‌టి కంటే కూడా బాడీలో ఈజ్ చాలా పెరిగింది అని చెప్ప‌వ‌చ్చు. అలాగే శ్రీ భార్య‌గా అవంతిక డీసెంట్ ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచింది. క‌న్నింగ్ పాత్ర‌లో శ‌శాంక్ న‌టించాడు. ఇక ప‌వ‌ర్ ఫుల్ అండ్ స్టైలిష్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో జెమిని సురేష్ అద్భుతంగా న‌టించి సినిమాకై హైలెట్ గా నిలిచాడు. జ‌బ‌ర్ద‌స్త్ దొర‌బాబు క‌నిపించింది ఒకే ఒక సీన్ లో అయినా న‌వ్వులు పండించాడు.

సాంకేతిక నిపుణుల పనితీరుః
ల‌వ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కు సంగీతం, సినిమాటో్గ్ర‌ఫీ చాలా ఇంపార్టెంట్. ఇక ఈ సినిమాకు ప‌ద్మ‌నావ్ భ‌రద్వాజ్ అందించిన మూడు పాట‌లతో పాటు నేప‌థ్య సంగీతం చాలా ప్ల‌స్ అయింది. ముఖ్యంగా ఆర్ పి ప‌ట్నాయ‌క్, ఉష క‌లిసి పాడిన పాట థియేట‌ర్ లో చూడటానికి విన‌డానికి బావుంది. అలాగే సినిమాటోగ్ర‌ఫీ కూడా క‌థ మూడ్ కి త‌గ్గ‌ట్టుగా ఉంది. ఇక ఈ సినిమా విష‌యంలో మెయిన్ గా చెప్పాలంటే ద‌ర్శ‌కుడు ఎన్నుకున్న క‌థ , క‌థ‌నాలు సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు. ఒక మంచి క‌థ‌ను ఎన్నుకోవ‌డ‌మే కాకుండా దానికి త‌గ్గ స్ర్కీన్ ప్లే రాసుకున్నాడు. ఫ‌స్ట్ టైమ్ సినిమా డైర‌క్ట‌ర్ లా కాకుండా ఎంతో అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడిలా డీల్ చేశాడు. ఇక నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ‌కు కావాల్సిన బ‌డ్జెట్ పెట్టి సినిమా క్వాలిటీగా రావ‌డానికి స‌హ‌క‌రించారు.

ఫైన‌ల్ గా చెప్పాలంటే…
హ్యాపీగా సాగిపోతున్న కొత్త‌గా పెళ్లైన జంట‌లోకి ఒక స్ట్రేంజ‌ర్ ని తీసుకొచ్చి అక్క‌డ నుంచి క‌థ‌ను మ‌లుపు తిప్ప‌డం చాలా కొత్త‌గా ఉంది. శ్రీ పాత్ర మొద‌ట్లో ప్లే బాయ్ గా ఉన్న‌ప్ప‌టికీ , ఇంట‌ర్ వెల్ కి వ‌చ్చేస‌రికీ కొన్ని సార్లు నెగిటివ్ షేడ్ లోకి వెళ్తుంది. అస‌లు హీరో నెగిటివ్ గా మార‌డానికి రీజ‌న్ చాలా క‌న్వెన్సింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో కి వ‌చ్చేస‌రికి హీరో పై ఎంతో రెస్పెక్ట్ పెరుగుతుంది. ల‌వ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ చిత్రాలు ఇష్ట‌ప‌డే వాళ్ల‌కు ప్ర‌ణ‌వం చాలా న‌చ్చుతుంది. చాలా గ్యాప్ త‌ర్వాత శ్రీ న‌టించిన ఈ చిత్రం త‌న‌కు మంచి రీ ఎంట్రీ అవుతుంది అన‌డంలో డౌట్ లేదు.

బాట‌మ్ లైన్ః ప్ర‌ణ‌వం హీరోగా శ్రీకి మంచి బోని అనుకోవోచు.

రేటింగ్ః 3/5

Related posts

Leave a Comment