ప్రిన్స్, నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభo

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య తమ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాన్ని రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శివ శశు దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమ్ వర్మ నిర్మాత. సినిమా ప్రారంభోత్సవం ఆదివారం ఫిలింనగర్ దైవసన్నిధానంలో జరిగింది.

సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది.

రెండు పాత్రలతో కథ సాగడం ఈ సినిమా ప్రత్యేకత అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

ఈ చిత్రానికి సంగీతం – జీవన్ బాబు, ఎడిటర్ – తేజ, సినిమాటోగ్రఫీ – రమణ జాగర్లమూడి, పాటలు – రామజోగయ్య శాస్త్రి, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ – రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఫణీంద్ర, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాత – గౌతమ్ వర్మ, రచన దర్శకత్వం – శివ శేషు.

Related posts

Leave a Comment