“పులి వచ్చింది మేక సచ్చింది” రివ్యూ

ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు “పులి వచ్చింది మేక సచ్చింది” చిత్రాన్ని నిర్మించారు. జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమా ఈ నెల 17న థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం

కథ: రాబర్ట్ (చిత్రం శీను), అరుణకుమారి (నిహారిక రెడ్డి)లిద్దరూ ఎంతో అన్యోన్యంగా భార్యా భర్తలు. వీరికి యోగి(వాసుదేవ్) వైశాలి (వర్ష ), మను అనే ముగ్గురు సంతానం. ఒకరంటే ఒకరికి అపారమైన ప్రేమ. అయితే సంతానంలో చివరి వాడైన మనుని… అన్న యోగి, అక్క వైశాలి చంపాలని వివిధ రకాలుగా ప్లాన్ వేస్తుంటారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా మను తల్లి అరుణ, తండ్రి రాబర్ట్ వాళ్ళ ఇంట్లోనే చనిపోయి విగత జీవులుగా పడి వుంటారు. మరి మనుని చంపాలనుకున్న వీరు ఎలా చనిపోయారు? అంత ప్రేమగా వుండే కుటుంబ సభ్యులు అసలు మనుని ఎందుకు చంపాలనుకున్నారు? అందుకు కారణం ఏంటి? మిగతా కుటుంబ సభ్యులు యోగి, వైశాలి ఏమయ్యారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

పులి వచ్చింది మేక సచ్చింది… ఈ సినిమాలో పులి ఎవరో చెబితే ప్రేక్షకులకు రూ.10 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించి… ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు చిత్ర దర్శకుడు ఆ.రాజశేఖర్ యాదవ్. ఇదొక సస్పెన్స్ క్రైమ్ డ్రామా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు… తన స్నేహితుడైన కరుడుగట్టిన నేరస్తుడికి మధ్య జరిగే కథ ఇది. ఇందులో దర్శకుడు కథ సింపుల్ ప్లాట్ మీదే రాసుకున్నా… కథనాన్ని మాత్రం కొత్తగా రాసుకున్నారు. రెండు పార్టుల సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ఎక్కడా రెండు పార్టుల మూవీగా అనిపించదు. ఫస్ట్ పార్ట్ కథకు ప్రేక్షకులు బాగా థ్రిల్ అవుతారు. ముగింపు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏదో కొత్తగా చెప్పాలనే ఉద్దేశంతో దర్శకుడు ఎలాంటి కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే రాయలేదు. సినిమాలో కథనం కొత్తగా ఉంటూ… స్ట్రెయిట్ గా వుంటూ ప్రేక్షకులకు సులువుగా అర్థమవుతుంది. సినిమా మొదలయినప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు… విరామం లేకుండా సస్పెన్స్ క్రైమ్ డ్రామా ఆడియన్స్ ని అలరిస్తుంది.

ఓ వైపు సాఫ్ట్ గా కనిపిస్తూనే… మరోవైపు క్రూఎల్ మెంటాలిటీ ఉన్న స్త్రీ లోలునిగా వ్యసనపరుడైన తండ్రి పాత్రలో రాబర్ట్ గా… చిత్రం శీను అలరించాడు.

ప్రపంచపు తొలి 360 డిగ్రీల స్క్రీన్ ప్లే సినిమాగా తెరకెక్కించి… ప్రేక్షకుల్లో మంచి క్యూరియసిటీని పెంచారు. దర్శకుడు రాసుకున్న కథ… కథనాలు ఆసక్తిగా ఉన్నాయి. సస్పెన్స్ క్రైమ్ డ్రామాని సక్సెస్ ఫుల్ గా రన్ చేయగలిగారు.

రేటింగ్: 3/5

Related posts

Leave a Comment