పుష్పక విమానం సినిమా రివ్యూ

రివ్యూ : పుష్పక విమానం
తారాగణం : ఆనంద్ దేవరకొండ, గీత్ శైనీ, శాన్వీ మేఘన, సునిల్, నరేష్, హర్షవర్ధన్
కెమెరా : హెస్టిన్ జోస్ జోసెఫ్
నిర్మాతలు : గోవర్ధనావు, విజయ్, ప్రదీప్
దర్శకత్వం : దామోదర

యూత్ ఐకన్ గా చాలా త్వరగా ఆడియన్స్ లో ముద్రపడిపోయాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరోగా ఫ్యాన్స్ కూడా పిలుచుకుంటున్నారు. అతను సొంతంగా బ్యానర్ పెట్టి మంచి కథలను ఎంకరేజ్ చేస్తున్నాం అంటూ ఈ మధ్య కొన్ని సినిమాలు చేశాడు. అందులో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఈ సారి పుష్పక విమానం అనే సినిమాతో లేటెస్ట్ గా వచ్చారు. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

సుందర్(ఆనంద్)గవర్నమెంట్ స్కూల్ లో మ్యాథ్స్ టీచర్. అతనికి పెళ్లైన వారం తర్వాత భార్య వేరేవారితో వెళ్లిపోతుంది. ఆమెను వెదికే క్రమంలో అనేక సమస్యలు తెచ్చుకుంటాడు. చివరికి ఆమెను ఎవరో హత్య చేస్తారు. అది ఇతనిపైనే పడుతుంది. మరి ఈ కేస్ నుంచి అతనెలా బయటపడ్డాడు. అసలు ఆమె వేరేవారితో ఎందుకు వెళ్లిపోయింది. సుందరం ఎదుర్కొన్న సమస్యలేంటీ అనేది కథ.

పుష్పక విమానం ట్రైలర్ చూసినప్పుడే ఇలాంటి కథ ఇప్పటి వరకూ తెలుగులోనే కాదు.. ఏ భాషలోనూ రాలేదు. వచ్చినా ఏ కమెడియన్ కో ట్రాక్ గా ఉంది తప్ప మెయిన్ స్టోరీగా రాలేదు. అందుకే ఇది అందరిలో ఆసక్తి కలిగించింది. దీనికి తోడు విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్ బాగా కలిసొచ్చింది. సాధారణంగా ఓ అప్ కమింగ్ హీరో ఇలాంటి కథ చేయడం సాహసం. ఆ సాహసాన్ని మంచి నటనతో ముగించాడు ఆనంద్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాడు. పిరికితనం, భయం, కోపం వంటి ఎమోషన్స్ ను బాగా పలికించాడు. కాకపోతే కాస్త కామెడీ, మరికాస్త ఎమోషన్, ఇంకాస్త క్రైమ్, థ్రిల్లర్ అంటూ కిచిడీ కథనంతో దర్శకుడు కొంత కన్ఫ్యూజ్ అయినా.. ఇది ఓ మంచి కథ. ఈ జెనరేషన్ కు ఖచ్చితంగా అవసరమైన కథ. చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలకు దారి తీయడం.. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే అనర్థాలు.. చిన్న కుటుంబాల్లో కనిపించే పరువు సమస్యలు అన్నిటినీ బాగా రాసుకున్నాడు దర్శకుడు. బాగా తీశాడు కూడా. కానీ ఎక్కువ అంశాలు టచ్ చేయడం వల్ల అక్కడక్కడా ఫ్లో మిస్ అయిన భావన కలిగినా.. ఓవరాల్ గా మెప్పించాడు.
ఆనంద్ దేవరకొండ బాగా చేశాడు. హీరోయిన్లలో గీత్ పాత్ర బావుంది. కాకపోతే ఇంకాస్త నిడివి ఉండాల్సింది. శాన్వీ మేఘన చాలా చాలా హుషారుగా నటించింది. కొన్ని సీన్స్ లో ఓ రేంజ్ లో డామినేట్ చేసింది. తను ఉన్నంత సేపూ నవ్వించే ప్రయత్నమే చేసింది. సునిల్ నటన సెటిల్డ్ గా బలే కుదిరింది. నరేష్ ఎప్పట్లానే ఓ సపోర్టింగ్ రోల్ తో ఆకట్టుకున్నాడు. పక్కింటి వ్యక్తిగా హర్షవర్ధన్ నవ్విస్తూనే ఆశ్చర్యపరిచే పాత్ర చేశాడు.
సంగీత పరంగా ఆడియో ఉన్నంతగా వీడియో సాంగ్స్ అనిపించవు. పెళ్లి సాంగ్ తో పాటు మాంటేజ్ గా వచ్చిన ఓ తారక పాట కొత్తగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా మంచి కథ రాసుకున్న దామోదర కథనంతో పాటు ఎడిటింగ్ పైనా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. అప్పుడు ఇంకా మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఓవరాల్ గా పుష్పక విమానం అంత గ్రాండ్ గా లేకపోయినా.. ఆకట్టుకుంటుందీ చిత్రం.

రేటింగ్ :3/5

Related posts

Leave a Comment