రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ‘డి.ఎస్.జె’ టీజర్ !

డైరెక్టర్ నట్టికుమార్ మాట్లాడుతూ…నేను గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఇప్పుడు నా దర్సకత్వంలో నా కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటించడం నాకు సంతోషం. నేను నా కూతురికి పాటలు నేర్పినట్లు ఉంది. అలాగే నా కుమారుడు నట్టి క్రాంతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మేము అడిగినవన్నీ మాకు సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో నా కొడుకు, కూతురు నిర్మాతగా హీరోయిన్ గా వ్యవహరించడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి అబ్బాయి రోషన్ సాలూరి హీరో అద్భుతంగా నటించాడు. కరోనా సమయంలో కూడా మేము అడగ్గానే మా సినిమా చేసినందుకు రోషన్ సాలూరికి ధన్యవాదాలు తెలిపారు.హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ…మా సినిమా డి.ఎస్.జె టీజర్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ గారికి ధన్యవాదాలు. కరోన సమయంలో అందరూ బాగా సహకరించడం వల్ల షూటింగ్ ఈజీగా పూర్తి అయ్యిందని తెలిపారు.హీరో రోషన్ సాలూరి మాట్లాడుతూ…నట్టికుమార్ గారు సినిమాను బాగా తెరకెక్కించారు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది. నట్టి కరుణ బాగా నటించింది, నటిగా తనకు మంచి భవిషత్తు ఉంటుంది. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. నట్టి క్రాంతి సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారని తెలిపారు.నటీనటులు:హీరో: రాజు సాలూరిహీరోయిన్: నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు.సాంకేతిక నిపుణులు:డైరెక్టర్: నట్టి కుమార్నిర్మాత: నట్టి క్రాంతికెమెరామెన్: కోటేశ్వర రావుసంగీతం: ఎస్.ఏ.కుద్దుస్ఎడిటింగ్: గౌతంరాజుఆర్ట్: కెవి.రమణఫైట్స్: కె.అంజిబాబుపిఆర్ఒ: మధు.విఆర్

Related posts

Leave a Comment