రావే నా చెలియా సినిమా రివ్యూ

రివ్యూ : రావే నా చెలియా
తారాగణం : నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ తదితరులు
డివోపి : విజయ్ దగ్గుపాటి
సంగీతం : ఎమ్ఎమ్ కుమార్
నిర్మాత : నెమలి సురేష్
దర్శకత్వం : మహేష్ రెడ్డి

కథ :
సినిమా దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు గగన్( అనిల్). ఓ అవకాశం వస్తుంది. వైజాగ్ షూటింగ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ తో కలిసి బయలుదేరతాడు. దారిలో అతనికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసే రాజేశ్వరి(సుభాంగి పంత్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తనను చూడగానే తన కథకు కరెక్ట్ గా సరిపోయే హీరోయిన్ అనిపిస్తుంది. ఇదే విషయం తనకు చెప్పి హీరోయిన్ గా నటించమంటాడు. తను ఒప్పుకోదు. అయినా అతను గట్టిగా ప్రయత్నిస్తాడు. అంతే గట్టి నో చెబుతుంది రాజేశ్వరి. మరి ఇంత మంచి ఛాన్స్ ను తను ఎందుకు వదులుకుంది..? దీని వెనక ఏదైనా కారణాలున్నాయి..? అటు గగన్ కు హీరోయిన్ దొరికిందా లేదా అనేది మిగతా కథ.

కథనం :
కొత్తగా వచ్చే కుర్రాళ్లంతా ఎక్కువ శాతం ప్రేమకథలనే నమ్ముకుంటున్నారు. ఈ విషయం మొదట్నుంచీ ఉంది. అయితే కొన్ని కథలు మాత్రమే ఆకట్టుకుంటాయి. ఈ రెండో కోవలోకిక వచ్చే సినిమానే రావే నా చెలియా. పరిస్థితులను బట్టి ఒకరిమీద మరొకరికి అభిప్రాయాలు మారతూ ఉంటాయి. ఆ మార్పులో ప్రేమ ఉంటుందా అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఒకవేళ సిట్యుయేషన్ ను బట్టి ప్రేమ మారినా దాన్ని అర్థం చేసుకుని ముందడుగు వేస్తే లైఫ్ హ్యాపీగా సాగిపోతుందనే సందేశం కూడా కనిపిస్తుంది. మరి ఒపీనియన్స్ మారుతున్నాయి అంటే ఇది ఖచ్చితంగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అర్థమౌతుంది కదా. యస్.. ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీనే. దీనికి తను ఎంచుకున్న పాయింట్ ను దాటకుండా మంచి ఎమోషన్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీని కూడా యాడ్ చేసుకున్నాడు. అందుకే ఈ కథ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. అఫ్ కోర్స్ చాలా వరకూ ఫార్ములానే ఫాలో అయినా.. పాతదనం లేని కథనం ఉండటం చాలా పెద్ద రిలీఫ్. క్లైమాక్స్ చాలా బావుంది.
హీరో హీరోయిన్లుగా నటించిన వారంతా చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు. ముఖ్యంగా అనిల్ నెమలి బాగా నటించాడు. ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా తడబాటు కనిపించలేదు. నటనలో ఈజ్ ఉంది. ఫైట్స్ డ్యాన్స్ లు ఇరగదీశాడు.
హీరోయిన్ బ్యూటీఫుల్ గా ఉంది. తన నటన కూడా ఫర్వాలేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రం తన నటన కాస్త ఎక్కువ ఆకట్టుకుంటుంది. రచ్చ రవితో చేయించిన గ్యారేజ్ కామెడీ కూడా వర్కవుట్ అయింది. మంచి పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా ఆద్యంతం మంచి లవ్ అండ్ ఎంటర్టైనింగ్ ప్యాక్ లా కనిపిస్తుంది.
దర్శకుడు మహేష్ రెడ్డి తను ఎంచుకున్న పాయింట్ నుంచి డీవియేట్ కాకుండా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇప్పటి వరకూ చాలా ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ చూసినా.. వాటికి భిన్నంగా సాగుతూ ఎక్కడా బోర్ అనిపించకుండా తీశాడు. ఇక సినిమాకు సంబంధించి మరో పెద్ద ప్లస్ పాయింట్ ఈ మధ్య వస్తోన్న చిన్న సినిమాలన్నీ అనివార్యంగా అడల్ట్ కంటెంట్ ను జొప్పిస్తున్నాయి. ఈ సినిమా అందుకు భిన్నం. చాలా క్లీన్ గా ఉంటుంది.
మొత్తంగా రావే నా చెలియా అనే టైటిల్ కు తగ్గట్టుగానే ఇదో ఫీల్ గుడ్ మూవీ.

రేటింగ్ :3/5

Related posts

Leave a Comment