RAW మూవీ సాంగ్ లాంచ్!!!

కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ లో లక్ష్మీ డొక్కర,డాక్టర్ వి గాయత్రి దేవి సమర్పించు రాజు డొక్కర నిర్మాత మరియు దర్శకుడి గా నిర్మించిన రా(RAW) చిత్రం సాంగ్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం ప్రభ చిల్డ్రెన్స్ హోంలో శివమ్ గోల్డెన్ హార్ట్స్ ఆధ్వర్యం లో ఘనంగా జరిగినది.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాజు డొక్కర,కార్తీక్, కుటుంబ సభ్యులు, శివమ్ గోల్డెన్ హార్ట్స్ హెడ్ శివప్రసాద(శివాజీ),రా మూవీ టీం సభ్యులు చైతూ, దిలీప్, కట్టప్ప పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజు డొక్కర(Raju Dokkara) గారు మాట్లాడుతూ…రా(RAW) మూవీ సంబంధించిన టీజర్ విడుదల చేసామని,ఈ రోజు ఒక సాంగ్ లాంచ్ చేసామని తండ్రి, కూతురు మధ్య అనుబంధం తెలిపే పాట ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చిందని,డ్రంక్ అండ్ డ్రైవ్ మీద హార్రర్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ జోనర్ లో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తీసామని, షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది అని,పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందని,వైజాగ్,పార్వతీపురం, అరకు,హైద్రాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రం రూపొందించామని,త్వరలో సినిమా విడుదల చేస్తామని ప్రేక్షకులు ఈ చిత్రం చూసి మమ్మల్ని అభినందించాలని కోరారు.ఈ సందర్భంగా టీజర్,పాట ని మంచిగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

నటీనటులు:
చంటి,వి.ఐ పి శ్రీ,చైతూ, మను,ఇర్ఫాన్
కుమనన్,సంజయ్,రామ సత్యనారాయణ,మేఘనచౌదరి, సిమ్రాన్,లోహిత,వైష్ణవి,అక్షయ,
బేబీబిందు,లీకిత్,దిలీప్,సూర్య,వినోద్

సాంకేతిక నిపుణులు:
నిర్మాత,కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం:రాజు డొక్కర
సినిమాటోగ్రఫీ:వి ఐ పి శ్రీ
ఎడిటర్:ఉదయ్
మ్యూజిక్:కె.వేదా
సింగర్:సురేంద్ర ఆదితి
లిరిక్స్:రామాంజనేయులు
పిఆర్ఓ:మధు విఆర్

Related posts

Leave a Comment