రొమాంటిక్ ,క్రైమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న “బీచ్ రోడ్”

అలంకృత ఆర్ట్స్ పతాకంపై.సునీల్ చరణ్ హీరోగా ,నందిత,శ్రీ వత్స,గూడుపు శ్రీను,జబర్దష్ నాగిరెడ్డి,సింహాద్రి నటీనటులుగా. యువ ప్రతిభాశాలి ”రజిని జి.విజయ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ గొర్రెల రామకృష్ణ,,మోకా బాబీ vln, వి.ఆర్.కుమార్.డి లు సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్ ,క్రైమ్ ఎంటర్టైనర్ “బీచ్ రోడ్”.ఈ చిత్రం మార్చి 8 నుండి రాజమండ్రి లో షూటింగ్ మొదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైద్రాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశంలో ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ..మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమా తీయాలనుకునే క్రమంలో దర్శకుడు విజయ్ రాసుకున్న కథ మాకు వినిపించడం జరిగింది. మా అందరికీ ఈ కథ నచ్చడంతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ సినిమాను నిర్మిస్తున్నాము . మార్చి 8 నుంచి నిరవధిక షూటింగ్ జరుపుకుని ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాము. అంతా కొత్తవారితో రాజమండ్రి, వైజాగ్ లలో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న లవ్, రొమాంటిక్ ,క్రైమ్ సినిమా అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు

దర్శకుడు మాట్లాడుతూ …నేను చాలా సినిమాలకు వర్క్ చేస్తున్నప్పుడే సినిమా తీయాలనే కోరికతో ఈ కథ రాసుకున్నాను. నేను రాసిన ఈ కథ విన్న నా ఫ్రెండ్స్ ఇంప్రెస్ అయి ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు.సస్పెన్స్, క్రైమ్ కథ తో సాగే ఈ “బీచ్ రోడ్” సినిమాకు కొత్త వారైతే బాగుంటుందని నూతన నటీనటులను సెలెక్ట్ చేయడం జరిగింది. మార్చి 8 నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ మొదలుపెట్టి వైజాగ్ షెడ్యూల్ తో పూర్తి చేస్తాము. 40 రోజుల్లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేస్తాము. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలని అన్నారు

హీరో సునీల్ మాట్లాడుతూ ….మా స్టూడియో లో 10 సంవత్సరాల నుండి ఎన్నో సినిమాలకు వర్క్ చేశాము,అప్పటినుండే సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది డైరెక్టర్ విజయ్ గారు వినిపించిన కథ నన్నెంతో ఇంప్రెస్ చేసింది. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మా తలకు ధన్యవాదాలు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొని ఈ చిత్రం విజయవంతం అవ్వాలని తెలిపారు.

నటీనటులు
సునీల్ చరణ్,నందిని,శ్రీ వత్స,గూడుపు శ్రీను,జబర్దష్ నాగిరెడ్డి,సింహాద్రి తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- అలంకృత ఆర్ట్స్
నిర్మాత :- గొర్రెల రామకృష్ణ,
కో ప్రొడ్యూసర్ :- మోకా బాబీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- వి.ఆర్.కుమార్.డి
కథ,మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం :- రజిని జి.విజయ్
సంగీతం :- ప్రతీక్
కెమెరామెన్ :- సతీష్ ముదిరాజ్,
పి.ఆర్.ఓ.:- లక్ష్మీ నివాస్

Related posts

Leave a Comment