శశి సినిమా సమీక్ష

నటీనటులు : ఆది, సురభి, రాశిసింగ్
సంగీతం : అరుణ్ చిలువేరు
సినిమాటోగ్రఫీ : అమర్నాధ్ బొమ్మిరెడ్డి
నిర్మాత‌లు : ఆర్.పి.వర్మ & రామంజనేయులు & చింతలపుడి శ్రీనివాస్
దర్శకత్వం : శ్రీనివాస్ నాయుడు నడికట్ల

టాలెంటెడ్ యాక్టర్ గా పేరున్నా.. ఆ రేంజ్ లో విజయాలు అందుకోలేకపోతున్నాడు ఆదిసాయికుమార్. ఈ సారి తన వయసుకు తగ్గట్టుగా ఓ మంచి ఇంటెన్సిటీ ఉన్న ప్రేమకథతో వస్తున్నానని ఫస్ట్ లిరికల్ సాంగ్ తోనే తేల్చాడు. ఆ పాట బిగ్గెస్ట్ హిట్ కావడంతో పాటు సినిమాపై మంచి అటెన్షన్ వచ్చేలా చేసింది “శశి”. టీజర్, ట్రైలర్ కూడా బావుండటంతో ష్యూర్ షాట్ అన్నట్టుగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ “శశి” ఎలా ఉంది..

ఇంటికి పెద్ద అయిన అన్న సంపాదనపై ఆధారపడి ఆవారాగా తిరుగుతుంటాడు రాజ్(ఆది). అతనో మ్యూజిషియన్. కానీ ఎప్పుడూ ఏదో కోల్పోయినవాడిలా ఉంటాడు. ఎప్పుడో గానీ తన ప్రతిభకు పని పెట్టడు. అలాంటి సందర్భంలో ఓ సారి శశి(సురభి)ని ఆగిపోతాడు. తన వెంటే పడుతుంటాడు. ఆమెతో తన లైఫ్ ను ఊహించుకుంటూ ఉంటాడు. కానీ అతని ఊహలకు వాస్తవానికి తేడా ఉంటుంది. మరి ఈ తేడా ఏంటీ.. రాజ్ .. శశి వెంటే ఎందుకు తిరుగుతున్నాడు. రాజ్ కు ఏమైనా గతం ఉందా.. ఉంటే ఏంటీ అనేది మిగతా కథ.
ముందే చెప్పుకున్నట్టుగా ఇదో ఇంటెన్సిటీ ఉన్న ప్రేమకథ. ట్రైయాంగిల్ అని చెప్పలేం కానీ.. ఆకట్టుకునే కథే. ఇలాంటి కథలు తెలుగులో గతంలో వచ్చాయి. అయినా వాటికి భిన్నమైన కథనంతో ఆకట్టుకుంటుంది శశి. మంచి కథ కాబట్టి.. ఇంకాస్త మంచి కథనం కూడా ఉంటే నెక్ట్స్ లెవెల్లో ఉండేది అనిపిస్తుంది. అయినా.. మెప్పిస్తుంది. ఆది, సురభి పెయిర్ చాలా బావుంది. ఇద్దరి నటన కూడా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఆది ఎమోషన్ సీన్స్ లో ఇరగదీశాడు. అతని కెరీర్ లో నే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకునేలా చాలా సీన్స్ లో అదరగొట్టాడు. మూడో పాత్ర గురించి చెప్పడం కంటే చూస్తేనే బెటర్. రాజీవ్ కనకాల, అజయ్, వెన్నెల కిషోర్ లకు పెద్దగా స్క్రీన్ టైం కూడా లేకపోయినా ఉన్నంతలో తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. అలాగే కమెడియన్ హర్ష కూడా బాగానే నవ్వించాడు.
టెక్నికల్ గా పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. సినిమాలోనూ విజువల్ గా సూపర్బ్ అనిపిస్తాయి. డైలాగ్స్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకత్వంలో కొన్ని లోపాలున్నా.. రాబోయే రోజుల్లో అతన్నుంచి మంచి సినిమాలే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

రేటింగ్: 3/5

Related posts

Leave a Comment