శుక్ర సినిమా సమీక్ష

థ్రిల్లర్ మూవీస్ సరిగ్గా కుదిరితే సూపర్ హిట్ దక్కినట్లే. కొత్త దర్శకులు తమ ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తుంటారు. అలా డెబ్యూ డైరెక్టర్ సుకు పూర్వజ్ రూపొందించిన చిత్రమే శుక్ర. థ్రిల్లర్ లో ఓ పార్ట్ అయిన మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన శుక్ర సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

విశాఖ నగరంలో థగ్స్ అనే మాఫియా ముఠా వరుస నేరాలకు పాల్పడుతుంటుంది. డబ్బున్న కుటుంబాలను హతమార్చి లూటీలు చేస్తుంటారు. నగరం నేరమయంగా ఉన్నప్పుడు ఇక్కడికి భార్యతో కలిసి వస్తాడు విల్లి.
విలియమ్ అలియాస్ విల్లి (అరవింద్ కృష్ణ) ఒక బిజినెస్ మెన్. సొంత కంపెనీ నడుపుతుంటాడు. అతని అందమైన వైఫ్ రియా (శ్రీజిత ఘోష్). విల్లి బిజీ లైఫ్ వల్ల వైజాగ్ వచ్చాకే ఈ జంటకు ప్రైవసీ దొరుకుతుంది. భర్త తనతో ఎక్కు టైమ్ స్పెండ్ చేయాలని రియా కోరిక. తన బర్త్ డేకు హౌస్ పార్టీ కావాలని విల్లిని కోరుతుంది రియా. అలా తన క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కలిసి విల్లీ రియా ఇంట్లో పార్టీ చేసుకుంటారు. ఈ పార్టీ జరిగిన రాత్రి అనూహ్యంగా రియా, మరో ఇద్దరి హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు చేసిందెవరు, హత్యలకు కారణం ఏంటి, తన భార్యను, స్నేహితులను చంపిన ఆ నేరస్తుడిని విల్లి ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ.

ఎనాలసిస్

శుక్ర సినిమా బాగుందనే క్రెడిట్ దర్శకుడు సుకు పూర్వజ్ కే దక్కాలి. ఓ కథను ఆకట్టుకునేలా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో సుకు పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది. సీన్ స్టార్ట్ కట్ మధ్య సుకు చూపించిన క్రియేటివ్ లిబర్టీ సూపర్బ్. అతనికి మంచి టీమ్ దొరికారు. ఎడిటింగ్, కెమెరా పనితనం శుక్ర కు అస్సెట్ గా చెప్పొచ్చు. సినిమాటోగ్రాఫర్ జగదీశ్ టాలెంటెడ్ డీవోపీ అనిపించుకున్నారు. ఇక నటీనటుల పర్మార్మెన్స్ విషయానికొస్తే.. విల్లి క్యారెక్టర్ అంటే అరవింద్ కృష్ణ గుర్తొచ్చేలా నటించాడు. భార్యతో సరదాగా ఉన్న రొమాంటిక్ సీన్స్ లో మ్యాన్లీగా కనిపించాడు. ఒక బిజినెస్ మేన్ గా ప్రొఫెషనల్ బాడీ లాగ్వేజ్ చూపించాడు. తన భార్య హాఫ్ హత్యకు గురయినప్పుడు ఎమోషనల్ సీన్స్ లో అరవింద్ సహజంగా నటించి మెప్పించాడు. రియా క్యారెక్టర్ లో శ్రీజిత న బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చింది. డబుల్ గ్లామర్ డోస్ ఇచ్చి, ట్రెండీ హీరోయిన్ అనేలా చేసింది. మెయిన్ లీడ్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, పోలీస్ క్యారెక్టర్స్ చేసిన నటీనటులు అంతా తమ పాత్రల పరిధి మేరకు కన్విన్సింగ్ గా నటించారు. ఇక క్లైమాక్స్ లో శుక్రకు సీక్వెల్ శుక్ర 2 ఉంటుందని చెప్పేయడం మరో విశేషం. కొత్త సినిమా చూడాలనుకునేవారు శుక్ర సినిమాకు వెళ్లొచ్చు.

ప్రేక్షకులను మెప్పించే థ్రిల్లర్ మూవీ శుక్ర

రేటింగ్ 3/5

Related posts

Leave a Comment