అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన “సురాపానం ” మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారి చేతుల మీదుగా రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో  నిర్వహించారు.
ఈ సందర్బంగా దర్శకుడు సంపంత్ కుమార్ గారు మాట్లాడుతూ ,
సురాపానం మూవీ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని,
ఒక విభిన్నమైన సరికొత్త కథాoశం తో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్
గా రాబోతున్న సురాపానం మూవీ ప్రతీ ప్రేక్షకులకు ఆనందాన్ని , ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ప్రొడ్యూసర్ మట్ట మధు యాదవ్ గారు మాట్లాడుతూ కథ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని , సినిమా ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఈ చిత్రంలో  హీరో హీరోయిన్ లుగా సంపత్ కుమార్, ప్రగ్య నయన్, మరియు ప్రధాన పాత్రలలో
మాస్టర్ అఖిల్ , సీనియర్ నటులు సూర్య , అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్ , విద్యాసాగర్ , అంజి బాబు, చమ్మక్ చంద్ర, కోటేశ్వరరావు , జెన్నీ, గిరి పోతరాజు తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంగీతం భీమ్స్  సిసిరోలియో, సినిమాటోగ్రాఫర్ విజయ్ ఠాగూర్, ఎడిటర్ జె. పి, డైలాగ్స్ రాజేంద్ర ప్రసాద్ చిరుత, ఆర్ట్ భూపతి యాదగిరి, కో డైరెక్టర్ శ్రీనివాస్ రాయ్, పబ్లిసిటీ డిజైనర్
ధని యేలే కాగా .నిర్మాత మట్ట మధు యాదవ్,
కథ -స్క్రీన్ ప్లే-దర్శకత్వం సంపత్ కుమార్ .

Related posts

Leave a Comment