”ఫిలిం ఓటీటీ”లో త్రిష, నివిన్ పాలీ ”హే జూడ్”, ఫిబ్రవరి 5న ప్రీమియర్

ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లు, కొత్త సినిమాల ప్రీమియర్, వివిధ భాషల్లోని డబ్బింగ్ చిత్రాలతో ‘ఫిలిం ఓటీటీ’ ఎగ్జైటింగ్, ఎంటర్ టైనింగ్ కంటెంట్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ”పిజ్జా 2” వంటి థ్రిల్లర్ సినిమాను తన తొలి ప్రీమియర్ గా ప్రదర్శించిన ఫిలిం ఓటీటీ…స్టార్ హీరోయిన్ త్రిష నటించిన తొలి మలయాళ చిత్రం ”హే జూడ్” ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రంలో నివిన్ పాలీ హీరోగా నటించారు. తెలుగు డబ్బింగ్ ”హే జూడ్” సినిమా ‘ఫిలిం ఓటీటీ’లో ఈ నెల 5న ప్రీమియర్ కానుంది.

2018 లో మాలీవుడ్ లో రిలీజైన ”హే జూడ్” సినిమా మంచి రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఆకట్టుకుంది. ఘన విజయాన్ని సాధించింది. దర్శకుడు శ్యామ్ ప్రసాద్ ”హే జూడ్” చిత్రాన్ని రూపొందించారు. ఇదే కాకుండా త్వరలో మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు ‘ఫిలిం ఓటీటీ’లో ప్రీమియర్ కు వస్తున్నాయి. మలయాళ స్టార్ మమ్ముట్టి రంగూన్ రౌడీ, ప్రియమణి నటించిన విస్మయ తో పాటు పలు తెలుగు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి.

https://bit.ly/2XEU0Bb

Related posts

Leave a Comment