వైష్ణ‌వ్ తేజ్ పంజా హీరోగా ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ సినిమా షూటింగ్ ప్రారంభం

వైష్ణ‌వ్ తేజ్ పంజా హీరోగా ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ సినిమా షూటింగ్ ప్రారంభం
2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో… అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్‌ గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మాత‌గా రూపొందుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభ‌మైంది. 
చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి వంగాగారి శిష్యుడు గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పెన‌తో యూత్‌కు ద‌గ్గ‌రైన వైష్ణ‌వ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర చేసేంత మంచి క‌థ‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించ‌బోతున్నాం. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.  ఈ సినిమాకు శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు’’ అన్నారు. 
న‌టీన‌టులు:
వైష్ణ‌వ్ తేజ్ పంజా, కేతికా శ‌ర్మ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:దర్శకత్వం: గిరీశాయనిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్బ్యాన‌ర్‌:  ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పీస‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడుసినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ ద‌త్సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌పి. ఆర్.ఓ: వంశీ కాక

Related posts

Leave a Comment