“వరుడు కావలెను” సినిమా రివ్యూ

సమీక్ష : వరుడు కావలెను
తారాగణం : నాగశౌర్య, రీతూవర్మ, వెన్నెల కిశోర్, నదియా, హర్షవర్ధన్
సంగీతం : విశాల్ చంద్రశేఖర్ – తమన్(రెండు పాటలు)
సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య

సితార బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుందనే ముద్ర చాలా త్వరగా పడిపోయింది.
అలాంటిది.. టైటిల్ నుంచి పోస్టర్స్ వరకూ కంప్లీట్ నీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపించిన సినిమా వరుడు
కావలెను. ముందు నుంచీ ఈ చిత్రంపై అంచనాలున్నాయి. వాటిని అందుకునేందుకు ఆడియన్స్ ముందుకు వచ్చిందీ చిత్రం.

కథ పరంగా చూస్తే భూమి ఓ కంపెనీని రన్ చేస్తుంది. ఆకాశ్ ప్యారిస్ లో ఆర్కిటెక్చర్. ఓ సారి ఇండియాకు వచ్చిన అతను అనుకోకుండా
భూమి కంపెనీకి సంబంధించిన ఓ ఇష్యూను సాల్వ్ చేస్తాడు. పైగా తనను చూడగానే ప్రేమలో పడతాడు. భూమికి పెళ్లన్నా,
అబ్బాయిలన్నా అస్సలు ఇష్టం ఉండదు. ఒకరకంగా ఇద్దరూ భిన్న ధృవాల వంటివారు. అలాంటి ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదరడం
నుంచి ప్రేమలో పడటం ఎలా జరిగింది. అసలు ఈ ఇద్దరూ కలిశారా లేదా అనేది కథ.

ప్రేమకథలకు మంచి పెయిర్ కుదరడం మొదటి ప్లస్ పాయింట్. ఇందులో ఆ పాయింట్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లేలా ఉన్నారు
నాగశౌర్య, రీతూవర్మ. నటనలోనూ ఇద్దరికీ వంక పెట్టేది లేకుండా పర్ఫెక్ట్ గా తమ పాత్రల్లో జీవించేశారు. దీంతో ఈ రెండు పాత్రలకు కనెక్ట్
కావడానికి ఆడియన్సెస్ కు పెద్దగా టైమ్ పట్టదు. ఆఫీస్ లోనే కాక ఇంట్లోనూ స్ట్రిక్ట్ గా ఉంటూ ఒక రకంగా అబ్బాయిలకు దూరంగా తనకు
తాను రిస్ట్రిక్టెడ్ గా ఉన్న అమ్మాయిని మార్చడం అనే పాయింట్ చుట్టూ మొదటి సగం కథ సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు
కొంత స్లోగా సాగినా.. వెన్నెల కిశోర్ కామెడీతో మంచి టైమ్ పాస్ అవుతుంది. పైగా రీతూను మార్చేందుకు శౌర్య చేసే పనులన్నీ ఫ్రెష్ గా
కనిపించడంతో మొదటి సగం ఇబ్బంది లేకుండా వెళ్లిపోతుంది.
ఇక మొదటి సగానికి ఆకాశ్ ని ఇష్టపడ్డ భూమి తర్వాతి సగంలో ఆ ఇష్టాన్ని తెలిపే ప్రయత్నంలో సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే
సన్నివేశాలను ఇంకాస్త పక్కాగా రాసుకుంటే బావుండు అని అప్పుడప్పుడూ అనిపించినా మలిసగంలో సప్తగిరితో పాటు ఇతర కామెడీ
అంతా మైనస్ లు కనిపించకుండా చేస్తుంది.
ఒక రకంగా ప్రేమకథల్లో ఉండాల్సిన కాన్ ఫ్లిక్ట్ తో పాటు ఎమోషనల్ కనెక్టివిటీ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. కాకపోతే ఇంకాస్త
బలంగా ఉంటే బావుండేది అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ఇద్దరు ప్రేమికులు మధ్య అపార్థాలు కామన్. వాటిని దాటుకుని మళ్లీ
కలవడం అనేది కథనంలో కనిపించే మ్యాజిక్. ఆ మ్యాజిక్ ను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ ను చేసింది దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. అక్కడక్కడా కాస్త త్రివిక్రమ్ సినిమాల ఫ్లేవర్ కనిపించినా.. అది కూడా ప్లస్ అవుతుంది కదా.
మొత్తంగా ఆర్టిస్టుల నటన, డైరెక్టర్ టేకింగ్, మంచి కథ, కథనాలున్న వరుడు కావలెను ఈ వీకెండ్ కు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం
నాగశౌర్య, రీతూవర్మ నటన
డైరెక్షన్
మ్యూజిక్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
కొన్ని ఎమోషన్స్ మిస్ కావడం
స్లో నెరేషన్

        రేటింగ్ :       3/5

Related posts

Leave a Comment