వెర్నాన్ అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లీనిక్ ప్రారంభోత్స‌వంలో సుమ క‌న‌కాల‌

మ‌న ఆహార్యం మ‌న‌లోని ఆత్మ‌విశ్వాసాన్ని తెలియ‌జేస్తుంద‌ని అన్నారు సినీన‌టి, ప్ర‌ముక వ్యాక్యాత సుమ క‌న‌కాల‌. బంజారాహిల్స్ రోడ్ నంబ‌రు 2లో నూత‌నంగా ఏర్పాటుచేసిన వెర్నాన్ అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లీనిక్ ప్రారంభోత్స‌వంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. సుమ మాట్లాడుతూ.. అందాల రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఎలాంటి దుష్ప‌రిణామాలు లేకుండా ఈ సేవలు అందిస్తున్న సంస్థ‌లు ఇప్పుడు మ‌న ముందుకు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా జుత్తు, సౌంద‌ర్య‌పోష‌ణ విష‌యంలో చాలా మంది ఇప్పుడు ఆస‌క్తి చూపుతున్నారు. సినిమా ప‌రిశ్ర‌మ‌, అందాల ప‌రిశ్ర‌మ‌, ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీల‌తోపాటు నేటి యువ‌తుల‌కు సౌంద‌ర్యానికి మెరుగులు దిద్దే ఇలాంటి కేంద్రాలు ఎంతో ముఖ్యం అన్నారు. వెర్నాన్ లాంటి వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇప్పుడు న‌గ‌రంలో అధునాత‌న సేవ‌లు పొంద‌వ‌చ్చ‌న్నారు.

సుప్రసిద్ధ సౌందర్యం, చర్మం & జుట్టు సంరక్షణపుణుడు, వెర్నాన్ నిర్వాహ‌కులు డాక్టర్. ఆర్ బ్రహ్మనాద రెడ్డి మాట్లాడుతూ మారుతున్న వైద్య నైపుణ్యాలు, చికిత్స పద్ధతులు మరియు సాంకేతిక పద్ధతులతో చికిత్స‌నందిస్తున్నామ‌న్నారు.

వెర్నాన్ యొక్క ఇంటీరియర్ సౌందర్యం మాత్రమే కాకుండా వ‌చ్చే అతిథుల‌ను ఆహ్లాదంగా ఉంచడానికి ఈ కేంద్రం ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దాం. లేజర్ హెయిర్ రిడక్షన్, పిగ్మెంటేషన్, యాక్నే & స్కార్ ట్రీట్‌మెంట్, పిఆర్‌పి హెయిర్ రిజువెనేషన్, పిఆర్‌పి స్కిన్ రిజువెనేషన్, యాంటీ ఏజింగ్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, టాటూ రిమూవల్, బోటాక్స్, ఫిల్లర్స్, నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్‌లు స్ట్రెచ్ మార్క్ ట్రీట్‌మెంట్, ట్రీట్‌రాయిడ్ ట్రీట్‌మెంట్ మొటిమ & స్కిన్ ట్యాగ్ తొలగింపు చికిత్స‌ల‌ను ఇక్క‌డ అందిస్తున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు వైద్యుదుల పాల్గొన్నారు.

Related posts

Leave a Comment