ఫిబ్ర‌వ‌రి 19న నాలుగు సౌత్ఇండియ‌న్ లాంగ్వేజెస్‌ విడుద‌ల‌కానున్న‌ యాక్ష‌న్ హీరో విశాల్ చ‌క్ర‌

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం చ‌క్ర‌. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు.
ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న తెలుగు,త‌మిళ‌,మ‌ళ‌యాల‌, క‌న్న‌డ భాషల్లో విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.ఈ సంద‌ర్భంగా..

యాక్ష‌న్ హీరో విశాల్ మాట్లాడుతూ – ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `చ‌క్ర` చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న నాలుగు సౌత్ఇండియ‌న్ లాంగ్వేజెస్‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

Related posts

Leave a Comment