ఆక‌ట్టుకుంటున్న విశాల్ `సామాన్యుడు` సెకండ్ లుక్…డిసెంబ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్‌



యాక్ష‌న్‌ హీరో విశాల్ కెరీర్‌లో 31వ మూవీగా రూపొందుతోన్న చిత్రం `సామాన్యుడు`. “నాట్ ఎ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్‌లైన్. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద్వారా తు పా శరవణన్  ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విశాల్ పుట్టిన‌రోజు సందర్భంగా విడుద‌ల చేసిన `సామ‌న్యుడు` టైటిల్ మ‌రియు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెకండ్‌లుక్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ప‌గిలిన గాజుసీసా చేతిలో ప‌ట్టుకుని యాక్ష‌న్ అవ‌తారంలో విశాల్ కూర్చుని ఉన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌చేస్తున్న‌ట్లు ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్‌. విశాల్ స‌ర‌స‌న‌ టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్‌గా న‌టిస్తోంది. యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ కి ప‌లు చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. టీజ‌ర్‌, యువ‌న్ శంకర్ రాజా స్వ‌ర‌ప‌రిచిన ఫ‌స్ట్ సింగిల్‌ను అతి త్వ‌ర‌లో విడుద‌ల‌చేయ‌నున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.

తారాగ‌ణం:
విశాల్‌, డింపుల్ హ‌యాతి, యోగిబాబు, బాబురాజ్ జాక‌బ్‌, పి.ఎ.తుల‌సి, ర‌వీనా ర‌వి

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌కత్వం: తు. పా  శ‌ర‌వ‌ణ‌న్‌
నిర్మాత: విశాల్‌
సంగీతం: యువ‌న్ శంక‌ర్‌రాజా
డిఒపి: క‌విన్‌రాజ్‌
ఎడిట‌ర్‌: ఎన్‌.బి శ్రీ‌కాంత్‌
ఆర్ట్‌: ఎస్ ఎస్ మూర్తి
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: వాసుకి భాస్క‌ర్‌

Related posts

Leave a Comment