విశ్వ‌క్ మూవీ రివ్యూ

నటీనటులు: అజయ్ కతుర్వర్, డింపుల్

సంగీతం: సత్య సాగర్ పొలం

సినిమాటోగ్రఫీ: ప్రదీప్ దేవ్

నిర్మాత: తాటికొండ ఆనందం బాల క్రిష్ణ

దర్శకుడు: వేణు ముల్క

కథ: విశ్వక్ ను (అజయ్) అమెరికా పంపించాలని పట్టుబడతాడు వాళ్ళ నాన్న. కానీ అజయ్ కి అమెరికా వెళ్లడం అస్సలు ఇష్టముండదు. ఇక్కడే ఉండి బిజినెస్ చేస్తా అంటాడు. ఆ విషయంలో తండ్రితో మనస్పర్థలు ఏర్పడుతాయి. ఇదే ప్రయాణంలో తనలాంటి భావాలే ఉన్న అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత తండ్రి ఇచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అంతా బాగానే ఉంది అనుకుంటాడు. కానీ బిజినెస్ బాగా లాస్ అవుతుంది. తాను ఆనుకున్న కాన్సెప్ట్ ని స్పాన్సర్ చేసేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాదు. ఆఖరికి అమెరికా సంస్థ కూడా ఛీ కొడుతుంది. దీంతో కంపెనీ మూసే పరిస్థితికి చేరతాడు. ఆ తర్వాత మరోసారి కంపెనీ ఓపెనే చేసినప్పటికీ సక్సెస్ కాలేక పోతాడు. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతాయి. తాను ప్రేమించిన అమ్మాయి కూడా దూరమవుతుంది. అదే సమయంలో అమెరికా వెళ్లాలనుకున్న ఒకరిని కిడ్నాప్ చేస్తాడు. అంతేకాదు ఇక్కడే ఉండి టాక్సులు కడుతున్న మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేస్తాడు. ఎన్నారైలకు సవాల్ విసురుతాడు. ఇంతకూ అజయ్ ఏం చెప్పాలనుకున్నాడు. ఏం చేయలానుకున్నాడు. తాను బిజినెస్ లాస్ కావడానికి కారణాల్ని కనుక్కున్నాడా. తాను అనుకున్న గోల్ రీచ్ కాగలిగాడా లేదా అన్నది అసలు సినిమా.

విశ్లేషణ: మూస పద్ధతులకు భిన్నంగా ఉంటుంది ఈ కథ. ఇందులో ముందు ఈ చిత్ర హీరో అజయ్ గురించి మాట్లాడుకోవాలి. దర్శకుడు అనుకున్న పాయింట్ కు సరిగ్గా సరిపోయాడు. యూత్ ని రిప్రజెంట్ చేస్తూనే బాధ్యత కలిగిన భారతీయుడి పాత్రలో చాలా బాగా నటించాడు. సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆవేశంతో కూడిన డైలాగ్స్ ని తనదైన ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించాడు. ఎక్కడా తన యాక్టింగ్ బోర్ కొట్టలేదు. పాత్రలో లీనమై నటించాడు. తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా తన కెరీర్ కు మరో మెట్టు ఎక్కించేలా యాక్టింగ్ చేసి చూపించాడు. తన లుక్స్ తో మెప్పించాడు. ఈ సినిమాలో చాలా మంది కొత్త నటీనటులు పరిచయమయ్యారు. వారంతా కూడా మంచి అనుభవం ఉన్న వారిలా నటించారు. ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంది ఇందులో. పాత్రలకు తగ్గట్టుగా ఆర్టిస్టులు చాలా నటించారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే. ఈ తరహా సబ్జెక్ట్ ఎంచుకోవడానికి ముందుగా గట్స్ కావాలి. ఇలాంటి సోషల్ మెసేజ్ ను ఇవ్వాలి అంటే చాలా ఆలోచించాలి. కానీ దర్శకుడు తాను అనుకున్న విషయాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. భారతీయతను ఎక్కడా తగ్గకుండా టెక్నాలజి, అభివృద్ధి, మన దగ్గర జరుగుతున్న ఆత్మహత్యల్ని ఇలా చాలా అంశాల్ని టచ్ చేశాడు. ఓ పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అన్ని ప్రాంతాల వారు అన్ని వర్గాల వారు చూసే చిత్రమిది. ఈ తరహా చిత్రాల్ని ఆదరించాల్సిన సమయమిది. కావున మీరు తప్పకుండా ఈవారం చూసేయండి.. గో అండ్ వాచ్ ఇట్

రేటింగ్: 3/5

Related posts

Leave a Comment