స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యువ సేవా బృందం ఓమౌజయా యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ


—-
మన స్వాతంత్ర్య సమర యోధులు అందించిన స్వేచ్ఛను గుర్తు చేసుకుంటూ ఆదివారం హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలోని పలు కూడళ్లలో భారత్ మాతా కి జై అంటూ యువ సేవా బృందం ఓమౌజయా యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకిల్ లపై ర్యాలీ నిర్వహించి వారి దేశ భక్తిని చాటారు… ఈ సందర్భంగా స్మార్ట్ ఐఎంఎస్ సి.ఈ.ఓ. నగేష్ రెడ్డి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి సైకిల్ ర్యాలీ కేవలం ఆరోగ్య సూచననే కాదు ఆరోగ్య భారత్ కు సైతం ఒక మంచి సూచనగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఏయూవైఎస్ఏ సంస్థ అధ్యక్షులు తిరుమల ఋషి, కార్యదర్శి మహేందర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని వారిని గుర్తు చేసుకుంటూ ఫ్రీడమ్ రైడ్ పేరిట ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో రెండు తెలుగు రాష్ట్రాల యువతి, యువకులు పాల్గొన్నారు.
*—-*
మధ్యాహ్నం జవహర్ నగర్ లో ఐఏయూవైఎస్ఏ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.

Related posts

Leave a Comment