ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. కీలకమై ఎక్సైజ్ శాఖ కమీషనర్ గా ముఖేష్ కుమార్ మీనాను నియమించింది. ఆ స్ధానంలో పనిచేస్తున్న పీ.లక్ష్మీనరసింహ్మను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే శ్రీనివాస్ శ్రీనరేష్ ను గనుల శాఖ కార్యదర్శిగా బదిలీ చేసి అక్కడ ఉన్న బీ.శ్రీధర్ ని పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా నియమించారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఎం.రామారావుని శ్రీకాకుళం కలెక్టర్ గా బదిలీ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ గా ఇంత వరకూ విధులు నిర్వర్తించిన కే.ధనుంజయరెడ్డిని పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. అలాగే క్రిష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నా బి.లక్ష్మీకాంతం ని టీటీడీ జేఈఓగా బదిలీ చేసింది. అక్కడ పని చేస్తున్న పీ.భాస్కర్ ని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమించారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న 2009 బ్యాచ్ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ ని క్రిష్ణా జిల్లా కలెక్టర్ గా నియమించింది. క్రిష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న కే.విజయను జీఏడీ కార్యదర్శిగా నియమించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈఓ గా పనిచేస్తున్న క్రుతికా శుక్లాను క్రిష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. అలాగే టూరిజం శాఖ డైరెక్టర్ గా ఉన్న హిమాన్షు శుక్లాను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు.

Related posts

Leave a Comment