ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు: విష్ణు కుమార్ రాజు

పార్టీ మారడంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర స్టేట్ మెంట్ ఇచ్చారు. ఓటమి భయంతోనే రాజకీయ నేతలు స్థానాలు మారుతుంటారని… తాను మాత్రం మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అయితే, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జ‌ల్లు కురిపించారు. పెన్షన్లు, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ పనితీరు బాగుందని కితాబిచ్చారు. తాను అజాత శత్రువునని, అన్ని పార్టీలవారితో మంచిగా ఉంటానని చెప్పారు. అమరావతిలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

Leave a Comment