ఫుడ్‌ ప్రాససింగ్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం సమావేశం

అరటి, చీనీ, టమోటా లాంటి రైతులు ప్రతి ఏటా తీవ్ర ఆందోళన చెందుతున్నారు: సీఎం
కనీస గిట్టుబాటు ధరలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
రైతులు పండించిన పంటను అమ్మకునేందుకు కష్టాలు పడకూడదు:
సంబంధిత పంటల విషయంలో ఫుడ్‌ప్రాససింగ్‌ను ప్రోత్సహించాలి:
దీనికోసం ప్రత్యేక శ్రద్ధపెట్టాలి:


వచ్చే సీజన్‌ కల్లా ఫుడ్‌ప్రాససింగ్‌కు ఏర్పాట్లు చేయాలి:
రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే… ఎంతమేర కొనుగోలు చేయాలి, ఎంతమేర ఫుడ్‌ప్రాససింగ్‌కు తరలించాలన్నదానిపై అధికారులు దృష్టిపెట్టాలి:
దీనికోసం ఖర్చు ఎంత అయినా పర్వాలేదు.. కాని సమస్యకు పరిష్కారం ఉండాలి:
ప్రతి ఏటా అరటి, చీనీ, టమోటా, ఉల్లి, నిమ్మలాంటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ కథనాలు వస్తున్నాయి:
మళ్లీ ఇలాంటి కథనాలు కనిపించకూడదు:
ప్రతి ఏటా ఇలాంటివి పునరావృతం కాకూడదు:
మిల్లెట్స్‌ ప్రాససింగ్‌పైన కూడా దృష్టిపెట్టండి….:
ఫుడ్‌ ప్రాససింగ్‌పై ప్రఖ్యాత కంపెనీలతో టై అప్‌ చేసుకోవాలి:లన్న సీఎం
ఇబ్బందులు వస్తున్న 7–8 పంటలను గుర్తించండి…:
వాటిని ప్రాససింగ్‌ చేసి… వాల్యూ ఎడిషన్‌ ఏం చేయగలమో ఆలోచనలు చేయండి….:
ఈ పంటల ప్రాససింగ్‌ చేయడానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో నాకు నివేదించండి…:
నెలరోజుల్లోగా దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తికావాలి:
అవసరమైనచోట్ల ఆర్బీకేల స్థాయిలోనే ప్రాథమిక స్థాయిలో ఫుడ్‌ ప్రాససింగ్‌ చేయాలి:
మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో తదుపరి ప్రాససింగ్‌ :
దీనిపై అంచనాలు తయారు చేయాలని సీఎం ఆదేశం

Related posts

Leave a Comment