రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి

ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ఆయుష్ రక్ష కిట్స్ ను అందజేయనున్నారు. 20 వేల కిట్స్ ను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు. ఈ రోజు BRKR భవన్ లోని మంత్రి కార్యాలయంలో ఆయుష్ రక్ష కిట్స్ ని పోలీస్ అధికారులకు అందించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ CP విశ్వప్రసాద్, IPS, బాలనాగాదేవి IPS, ఐజిపి హోమ్ గార్డ్స్, ఏసిపి సైఫాబాద్ వేణుగోపాల్ రెడ్డి లకు మంత్రి ఈటల రాజేందర్ గారు కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయుర్వేద అతి ప్రాచీనమైన వైద్య శాస్త్రం. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమీషనర్ అలుగు వర్షిణి ఆధ్వర్యంలో ఆ డిపార్ట్మెంట్ ఐదు రకాల మందులతో ఈ కిట్ తయారు చేశారు వారికి అభినందనలు. ప్రపంచానికి ఇలాంటి వైద్యాన్ని అందించిన దేశం భారత దేశం అని మంత్రి అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశం కరోనా వ్యాప్తి నీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాప్తి, మరణాల రేట్ చాలా తక్కువ ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్ అడిషనల్ డెరైక్టర్ అనసూయ, ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, సూపరింటెండెంట్ పరమేశ్వర్, డ్రగ్ టెస్టింగ్ లాబొరటరీ డైరెక్టర్ శ్రీనివాస చారీ, ఫార్మసీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్.
ప్రొఫెసర్ కె సి. డాక్టర్ శ్రీకాంత్ బాబు, కేంద్ర ఆయుర్వేద రీసెర్చ్ కౌన్సిల్ అధికారి డాక్టర్ సాకేత రాం, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ , విశ్వ ఆయుర్వేద పరిషద్ నేషనల్ సెక్రెటరీ డాక్టర్ ప్రేమనందరావు. డాక్టర్ సురేష్ జకోటియ పాల్గొన్నారు.

ఈ కిట్స్ తో పాటుగా..
విశ్వ ఆయుర్వేద పరిషద్ తరపున 250 గ్రాముల చవన్ ప్రాష్ రెండు వేల యూనిట్లు పంపిణీ చేస్తున్నట్లు సెక్రెటరీ తెలిపారు.

Related posts

Leave a Comment