కరోన వైరస్ తో పాటుగా ఇతర వ్యాధుల చికిత్స

వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి ఈటల రాజేందర్ కరోనా పేషెంట్ లకు అందుతున్న ఆక్సిజన్ సరఫరా పై సుదీర్ఘంగా సమీక్షించారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోగా వాటి పనుల పురోగతిపై చర్చించారు.ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్, నీమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే లిక్విడ్ ఆక్సిజన్ టాంక్ లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. కింగ్ కోటి, టిమ్స్ హాస్పిటల్, మహబూబ్ నగర్ హాస్పిటల్ లో తాజాగా ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాట్లు పూర్తి అయింది. సిద్దిపేట కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వారం రోజుల్లో ఆక్సిజన్ ఏర్పాటు పూర్తి కానుంది, మిగిలిన చోట్ల మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో LOT లు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు మంత్రికి వివరించారు.
లక్ష కేసులు నమోదైతే 15వేల మందికి అడ్మిషన్ అవసరమవుతుందని అందులో పది వేల మందికి ప్రభుత్వాసుపత్రిలో ఐదు వేల మందికి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందేలాగా పూర్తిస్థాయి ఏర్పాట్లు జరిగేలా చూడాలని మంత్రి మరోమారు ఆదేశించారు.
గ్రామాల్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉండే అవకాశాలు తక్కువ ఉన్న వారికి ప్రభుత్వ ఐసొలేశన్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని, వాటిలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు, మందులు కిట్లు డిస్పోజబుల్ కొరత లేకుండా చూడాలని కోరారు.
కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 100 అంబులెన్సులు వైద్య ఆరోగ్య శాఖకు అందిస్తున్న నేపధ్యంలో వాటి సర్వీసును పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఈరోజు మంత్రి ఆదేశించారు.కరోన వైరస్ తో పాటుగా ఇతర వ్యాధుల చికిత్స కూడా ఆస్పత్రుల్లో దృష్టిలో పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలి ఉన్న ప్రాంతంలో సాధారణ వైద్య సేవలు అన్నీ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
చాలా ఆసుపత్రిలో వైద్య పరికరాలు పనిచేయడం లేదని అసెంబ్లీ వేదికగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య పరికరాల పై ఒక నివేదిక తయారు చేయాలని, ఎక్కడెక్కడ పరికరాలు పనిచేయడం లేదు అనే వివరాలను తెలియచేయాలని మంత్రి తెలిపారు. పరికరాల మెయింటెనెన్స్ చేయడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు

Related posts

Leave a Comment