కరోనాకు వ్యాక్సిన్‌ వస్తుందో రాదో తెలీదుగానీ., ఖ‌చ్చితంగా ఎఫ్‌ 3తో నవ్వుల వ్యాక్సిన్ వ‌స్తుంది-అనిల్ రావిపూడి

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడిఅనిల్‌ రావిపూడి….ఇప్పుడు ఇండస్ట్రీలో, ఆడియెన్స్‌లో ఈ పేరుకి ఓ ప్రత్యేకమైన వేల్యూ ఉంది. పటాస్‌.. సుప్రీమ్‌.. రాజాదిగ్రేట్‌.. ఎఫ్‌2… సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకటి కాదు రెండు కాదు. వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్‌తో ప్రేక్షకులకు 100% వినోదాన్ని నిర్మాతలకు, బయ్యర్స్‌కు 100% లాభాలను అందించి ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్పెషల్‌ బ్రాండ్‌గా నిలిచి జెట్‌ స్పీడుతో దూసుకెళ్తూ.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి బర్త్‌ డే నవంబర్‌ 23. ఈ సందర్భంగా అనిల్ రావిపూడితో స్పెషల్‌ ఇంటర్వ్యూ…బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌గా దూసుకెళ్తోన్న మీకు.. మీ జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. పటాస్‌తో డైరెక్టర్‌గా నా జర్నీ స్టార్ట్‌ అయ్యింది. దర్శకుడిగా నన్ను ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా అది. అందుకు కారణం నందమూరి…

Read More