ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘బ్యూటీ గర్ల్’

లక్ష్మీ నారాయణ సినిమా పతాకంపై అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా.. వేముగంటి దర్శకత్వంలో ప్రముఖ షోలాపూర్ డిస్ట్రిబ్యూటర్ దేవదాస్ నారాయణ నిర్మిస్తోన్న చిత్రం ‘బ్యూటీ గర్ల్’. ఈ చిత్రం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ.. షూటింగ్ జరుపుకుని ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దేవదాస్ నారాయణ మాట్లాడుతూ.. ‘‘షోలాపూర్‌లో నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్‌గా 400కి పైగా పెద్ద సినిమాలు రిలీజ్ చేశాను. ఆ అనుభవంతో ఈ ‘బ్యూటీ గర్ల్’ సినిమాను నిర్మిస్తున్నాను. మా డైరెక్టర్ వేముగారి దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతంగా రాబోతుంది. అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. షూటింగ్ చేస్తున్నాము. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో…

Read More