“చిత్రపటం” కు విశేష స్పందన. ఆసక్తికరంగా ఉందంటూ చర్చలు

బండారు దానయ్య కవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “చిత్రపటం” సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. పల్లెటూరు నేపధ్యంలో సినిమా తెరకేక్కుతున్నట్టు ఆ లుక్ చూస్తూనే అర్ధమవుతుంది. పాతకాలపు కుర్చీ, కుర్చీ మీద ఒక టవల్, పక్కన స్టూల్, స్టూల్ మీద పాతకాలపు రాగి చెంబు బ్యాకగ్రౌండ్ పొలాలను చూపిస్తూ డిజైన్ చేసిన ఈ లుక్ చూస్తుంటే ఒక స్వచ్ఛమైన పల్లెటూరులో కొన్ని అద్భుతమైన పాత్రల సమూహంతో సినిమా కథ నడిసేలా అర్ధమవుతుంది. ఈ సందర్భంగా ఎన్నో సూపర్ హిట్టు సినిమాలకు చక్కటి సాహిత్యం అందించి, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బండారు దానయ్య కవి మాట్లాడుతూ “విడుదల చేసిన ఫస్ట్ లుక్ తోనే మా చిత్రపటం సినిమాకు మంచి స్పందన దక్కుతుంది. అన్ని వైపుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో నాకు పరిచయం ఉన్న పెద్ద…

Read More