‘DSJ’ ‘దెయ్యంతో సహజీవనం…’ మూవీతో ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ తెరంగేట్రం

నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) మూవీ సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి నట్టి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి క్రాంతి. సమర్పణ నట్టి లక్ష్మి. ఈ చిత్రం మహూర్తపు షాట్ కి నట్టి క్రాంతి డైరెక్షన్ చేయగా… కెమెరా నట్టి లక్ష్మీ స్విచాన్ చేశారు. ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు క్లాప్ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, ఈ చిత్రం డైరెక్టర్ నట్టి కుమార్ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని ఒక యాథార్థ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేదాన్ని చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రముఖ సంగీత…

Read More