నవంబర్ 1న ”ఫిలిమ్” ఓటీటీ లాంఛ్, తొలి ప్రీమియర్ గా ”పిజ్జా 2”

ఇంట్రెస్టింగ్ కంటెంట్, రేర్ కలెక్షన్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ‘ఫిలిమ్’ ఓటీటీ సిద్ధమవుతోంది. ‘ఫిలిమ్’ యాప్ లో కొత్త సినిమాల ప్రీమియర్ లు, ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులు చూసేయచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఫిలిమ్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ‘ఫిలిమ్’ లో తొలి చిత్రంగా నవంబర్ 1న ”పిజ్జా 2” సినిమా ప్రీమియర్ కానుంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించారు. గాయత్రి నాయికగా నటించింది. ఈ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ”పిజ్జా 2” ‘ఫిలిమ్’ వీక్షకులను ఆకట్టుకోనుంది. ఇదే కాకుండా త్రిష, నివిన్ పాలీ నటించిన ”హే జ్యూడ్”, మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన ”రంగూన్ రౌడీ”, ప్రియమణి థ్రిల్లర్ ”విస్మయ”, ధృవ, జేడీ చక్రవర్తి…

Read More