గెటప్ శ్రీను హీరోగా సూడో రియలిజం (Pseudo Realism) జాన‌ర్‌లో ‘రాజు యాద‌వ్‌’ సినిమా ప్రారంభం

గెట‌ప్‌ శ్రీ‌ను హీరోగా సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రాజు యాద‌వ్‌’. ఐఐటీ మ‌ద్రాస్‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేసి, ‘విన్సెంట్ ఫెర‌ర్’ అనే స్పానిష్ ఫిల్మ్‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా, అనంత‌రం తెలుగులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల రూపొందించిన ‘నీది నాది ఒకే క‌థ‌’, ‘విరాట‌ప‌ర్వం’ చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కృష్ణ‌మాచారి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గెట‌ప్ శ్రీ‌ను స‌ర‌స‌న నాయిక‌గా అంకిత క‌ర‌త్ న‌టిస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె. చంద్ర క్లాప్ నిచ్చారు. డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల‌, ప్ర‌ముఖ‌ నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ సంయుక్తంగా స్క్రిప్టును ద‌ర్శ‌కుడు కృష్ణ‌మాచారికి అంద‌జేశారు. ఒక…

Read More