దెబ్బతిన్న ప్రాంతాలలో వారంరోజుల లోపే

హైదరాబాద్ నగరంలో గత వందేళ్ల చరిత్రలో మరెన్నడూ లేనంతగా వచ్చిన భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలలో వారంరోజుల లోపే మామూలు పరిస్థితులు ఏర్పడే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే.టీ. రామారావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన పునరుద్ధరణ, సహాయక చర్యలపై నేడు సాయంత్రం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీ.హెచ్.ఎం.సి. కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జీ.హెచ్.ఎం.సి, జలమండలి, దక్షణ మండల విధ్యుత్ పంపిణి సంస్థ, హైదరాబాద్ మెట్రో రైల్. మూసీ రివర్ డెవలఫ్మెంట్ తదితర శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల నాలుగు…

Read More

68.40 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నట్లు జిహెచ్ఎంసి

హుస్సేన్ సాగర్ నుండి మూసి వరకు ఉన్న నాలా పటిష్టత, అభివృద్దికి రూ. 68.40 కోట్ల నిధులతో పనులు చేపడుతున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. వరద బాదిత కుటుంబాలను పరామర్శించుటకు ఇటీవల గోల్నాక ప్రాంతంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పర్యటించారు. ఈ సందర్భంగా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ నుండి మూసి వరకు ఒక కిలోమీటర్ పొడవున మూసికి రిటైనింగ్ వాల్ నిర్మించి, ఈ ప్రాంతంలోని కాలనీల వరద ముంపు సమస్య పరిష్కరించనున్నట్లు మంత్రి కె.టి.ఆర్ హామీ ఇచ్చారు. తదనుగుణంగా మంత్రి కె.టి.ఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు ముఠా పద్మ, జి.శ్రీదేవి, ఇరిగేషన్ అధికారులతో కలిసి నల్లకుంటలో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. వరద ముంపుకు గురవుతున్న కాలనీలలోని కుటుంబాలతో మేయర్…

Read More