డిఫ‌రెంట్ స్పై థ్రిల్ల‌ర్ గ్రే షూటింగ్ పూర్తి…

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న చిత్రం గ్రే. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కుతోన్నఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్లో గుమ్మ‌డికాయ కొట్టారు చిత్ర యూనిట్‌. త్వ‌ర‌లోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభంకానున్నాయి. ఈ సంద‌ర్భంగా… చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజ్ మాట్లాడుతూ – అద్వితీయ మూవీస్ ప్రై.లి పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న `గ్రే` మూవీ షూటింగ్ ఈ రోజు పూర్త‌య్యింది. ఇదొక స్టైలిష్‌ స్పై థ్రిల్లర్ మూవీ. ట్విస్టులు ట‌ర్నుల‌తో ఆధ్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్…

Read More