అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న ”కళాపోషకులు”

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత ఏమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…‘కళాపోషకులు’ చిత్రాన్ని దర్శకుడు చలపతి పువ్వుల బాగా తెరకెక్కించాడు. మహావీర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది. నటీనటులు అందరూ బాగా చేశారు. కోవిడ్ 19 లాక్ డౌన్ తరవాత ప్రభుత్వ సూచనలు, చిత్రసీమ పెద్దల సలహాలు పాటిస్తూ చిత్రీకరణ మొదలు పెట్టీ…

Read More