పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హుషారు ఫెమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ…మా చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న మా సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేస్తున్నాం. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు. నటీనటులు:దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్,…

Read More