స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా విడుద‌ల‌కానున్న‌విక్ట‌రి వెంక‌టేష్ `నార‌ప్ప`

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి,  వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌,  పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్ స‌రికొత్త పోస్ట‌ర్‌ విడుద‌ల చేశారు. వెంకటేష్ , ప్రియ‌మ‌ణి ఫ్యామిలీ అంతా ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. వెంకీ గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని విధంగా ఇలా ఫ్యామిలీతో క‌లిసి కొత్త‌గా కనిపిస్తున్నా‌రు. పోస్ట‌ర్…

Read More

‘నారప్ప’ ఫస్ట్ గ్లింప్స్ మీతో పంచుకోవడం గర్వంగా ఉంది – విక్టరి వెంక‌టేష్‌

‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఆయ‌న లేటెస్ట్ మూవీ  ‘నారప్ప’  నుండి `గ్లిమ్స్‌ ఆఫ్ నార‌ప్ప`పేరుతో టీజ‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.  ఈ మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ ని మాత్ర‌మే హైలైట్ చేస్తూ చూపించి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఈ గ్లిమ్స్ ద్వారా ముందే హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ టీజ‌ర్‌ వెంక‌టేష్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా చెట్టుచాటు నుండి క‌త్తి ప‌ట్టుకుని న‌డుచుకుంటూ వ‌స్తూ  రౌద్రం పలికించిన తీరు అభిమానుల్ని ఉర్రూత‌లూగిస్తోంది. వెంక‌టేష్ సరికొత్త గెటప్, బాడీ లాంగ్వేజ్‌తో చాలా కాలం తర్వాత మాంచి మాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకాభిమానులను అలరించనున్నారని గ్లింప్స్ చూస్తూ అర్థమవుతోంది. న్యాచుర‌ల్ లుక్‌లో వెంక‌టేష్ `నారప్ప`పాత్ర‌లోకి పరకాయ ప్రవేశం చేశారని  అటు ప్రేక్ష‌కులు,…

Read More