“ప్లాన్-బి” టీజర్ ని రిలీజ్ చేసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్!!

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా డింపుల్ హీరోయిన్ గా ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై నవ దర్శకుడు కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న చిత్రం “ప్లాన్-బి”. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కునాల్ శర్మ ప్రతినాయకుడుగా నటించడం విశేషం.. కాగా ఈ చిత్రం టీజర్ ని మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రిలీజ్ చేసారు. టీజర్ చాలా క్యూరియాసిటీగా ఉందని, సినిమా గ్రాండ్ సక్సెస్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని.. ఆయన టీమ్ ని అభినందించారు. చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ.. ‘ ఫస్ట్ సిట్టింగ్ లోనే…

Read More