క్వశ్చన్ మార్క్ `?` సాంగ్ లాంచ్

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో  గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో  నిర్మించబడుతున్న నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?).  షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోన్న ఈ చిత్రం లోని `రామ‌స‌క్క‌నోడివిరో` అనే పాట‌ను ఈ రోజు హైద‌రాబాద్ లో లాంచ్ చేశారు. ఈ పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా బండి స‌త్యం సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. మంగ్లీ ఆల‌పించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. ఈ సంద‌ర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ…“ఈ చిత్రంలో మొద‌ట పాట పెట్టాల‌నుకోలేదు.  షూటింగ్ పూర్త‌య్యాక అనుకొని ఈ సాంగ్ చేశాం. బండి స‌త్యం గారు అద్బుత‌మైన సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు.  శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు కంపోజ్ చేసిన స్టెప్స్  ఆదాశ‌ర్మ‌గారు అద‌ర‌గొట్టారు. నిర్మాత గౌరికృష్ణ…

Read More