రాజ్ పుత్` షూటింగ్ ప్రారంభం!!

బంజారా బిగ్ సినిమాస్ ప‌తాకంపై బంజార భాష‌లో గోర్ మాటిగా తెలుగులో రాజ్ పుత్‌గా రెండు భాష‌ల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రేఖ్యా నాయ‌క్‌. శంక‌ర్ జాద‌వ్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అదిరే అభి మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. సిరిరాజ్‌, క‌రిష్మా రామ్ హీరోయిన్స్. ఈ చిత్రం ఈ రోజు ఫిలింన‌గ‌ర్‌లోని తెలంగాణ ఫిలించాంబ‌ర్ లో షూటింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించుకుంది.ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ‌ ఫిలించాంబ‌ర్ చైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ..తెలంగాణ టీమా సెక్ర‌ట‌రి వి.తిరుమ‌ల దేవి కెమేరా స్విచాన్ చేశారు. మ‌రో అతిథి లక్మ‌ణ్ వేముల గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ…ఇటీవ‌ల కాలంలో బంజార భాష‌లో రూపొందిన చిత్రాలు విజ‌యం సాధించాయి. ఆ కోవ‌లో ఈ చిత్రం…

Read More