కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలు రామ్‌ ఇంకా ఎన్నెన్నో చేయాలి- ‘రెడ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక లో అగ్ర దర్శకులు త్రివిక్రమ్‌

”నేను మా పెదనాన్నతో కలిసి చాలా సినిమాలు చేశాను. అయితే  స్టేజీ మీద ఆయన గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడాలనిపిస్తోంది. నా దృష్టిలో ‘రెడ్‌’ చిత్రానికి రియల్‌ హీరో మా పెద్దనాన్న గారు. కరోనా టైం లో వచ్చిన ఇబ్బందులనన్నిటినీ తట్టుకున్నారు . ‘రెడ్‌’  చిత్రాన్ని ఈ రోజూ థియేటర్లవరకు తీసుకురావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్రాన్ని చంటి బిడ్డలా కాపాడుతూ వచ్చారు. అందుకే ఈ చిత్రానికి ఆయనే హీరో. నిజంగా నా ఎనర్జీ అంతటికీ కారణమైన నా అభిమానులకి, నా 15 ఏళ్ళ  కేరీర్ లో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ  అందరికీ థాంక్స్. ఈ నెల 14న రెడ్ మూవీని థియేటర్లలో తప్పక చూడండి” అని ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ అన్నారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రెడ్‌’. శ్రీ స్రవంతి మూవీస్‌…

Read More