సతీష్ మాలెంపాటి ద‌ర్శ‌క‌త్వంలో అక్షిత్ శ‌శికుమార్ హీరోగా తెలుగు,క‌న్న‌డ‌,త‌మిళ భాష‌ల్లో `స‌మిధ` చిత్రం ప్రారంభం

‘మర్మం’,’కనులు కలిసాయి`వంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించి ఇప్పుడు వెండితెర‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు సతీష్ మాలెంపాటి. ఆయ‌న‌ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు,క‌న్న‌డ‌,త‌మిళ భాష‌ల‌లో తెర‌కెక్కుతోన్నచిత్రం  ‘సమిధ`. క‌న్న‌డ స్టార్ హీరో శ‌శికుమార్ త‌న‌యుడు అక్షిత్ శ‌శికుమార్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో `ఉండిపోరాదే` మూవీ ఫేమ్ అనువ‌ర్ణ‌, త‌మిళ న‌టి ఛాందిని హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అరుణం ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ మూవీ హైద‌రాబాద్ సంస్థ కార్యాల‌యంలో ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఆశీశ్ క్లాప్ కొట్ట‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ కెమెరా స్విచాన్ చేశారు. డిసెంబ‌ర్ 8 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి 2021 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈసంద‌ర్భంగా.. చిత్ర ద‌ర్శ‌కుడు సతీష్ మాలెంపాటి మాట్లాడుతూ – “నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మొద‌టి చిత్రం`స‌మిధ`‌. రాజ‌స్థాన్‌లో జ‌రిగిన‌…

Read More