శుక్ర సినిమా సమీక్ష

థ్రిల్లర్ మూవీస్ సరిగ్గా కుదిరితే సూపర్ హిట్ దక్కినట్లే. కొత్త దర్శకులు తమ ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తుంటారు. అలా డెబ్యూ డైరెక్టర్ సుకు పూర్వజ్ రూపొందించిన చిత్రమే శుక్ర. థ్రిల్లర్ లో ఓ పార్ట్ అయిన మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన శుక్ర సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కథ విశాఖ నగరంలో థగ్స్ అనే మాఫియా ముఠా వరుస నేరాలకు పాల్పడుతుంటుంది. డబ్బున్న కుటుంబాలను హతమార్చి లూటీలు చేస్తుంటారు. నగరం నేరమయంగా ఉన్నప్పుడు ఇక్కడికి భార్యతో కలిసి వస్తాడు విల్లి.విలియమ్ అలియాస్ విల్లి (అరవింద్ కృష్ణ) ఒక బిజినెస్ మెన్. సొంత కంపెనీ నడుపుతుంటాడు. అతని అందమైన వైఫ్ రియా (శ్రీజిత…

Read More