ఆమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న “శుక్ర”

ఈ ఏడాది థియేటర్లలో రిలీజైన చివరి సినిమా “శుక్ర”. మైండ్ గేమ్ నేపథ్యంలో థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచింది. “శుక్ర” సినిమాలో అరవింద్ కృష్ణ, కొత్త అమ్మాయి శ్రీజితా ఘోష్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి చిత్రంతో దర్శకుడిగా మెప్పించారు సుకు పూర్వజ్. నిర్మాతలు అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె లకు లాభాలు తెచ్చిపెట్టిన “శుక్ర” తాజాగా అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది “శుక్ర”. థియేటర్లలో ఈ యూత్ ఫుల్ థ్రిల్లర్ ను మిస్ అయిన వారు అమోజాన్ లో చూసి ఎంజాయ్ చేయమని చిత్ర బృందం ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తోంది.

Read More

“శుక్ర” కొత్త కాన్సెప్ట్ మూవీ, ఖచ్చితంగా ఆడియెన్స్ కు నచ్చుతుంది – “శుక్ర” మూవీ టీమ్

మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా‌ “శుక్ర”. సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శుక్ర సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో చిత్ర విశేషాలను యూనిట్ పంచుకుంది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ….ఇట్స్ మై లవ్ స్టోరి చిత్రంతో అరవింద్ కృష్ణను ఇంట్రడ్యూస్ చేశాం. టాలెంట్ ఉన్న నటుడు. చాలా రోజుల గ్యాప్ వచ్చింది అతనికి. ఈ గ్యాప్ తర్వాత మంచి యాక్షన్ ఫిల్మ్ తో మీ ముందుకొస్తున్నాడు. శుక్ర మూవీని దర్శకుడు సుకు…

Read More