జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మద్ధతు ఇవ్వండి – నటుడు కాదంబరి కిరణ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మద్ధతు ఇవ్వాలని ప్రముఖ నటులు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ విజ్ఞప్తి చేశారు. నగర అభివృద్ధికి, చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి తెరాస ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన అన్నారు. టాలీవుడ్ ను కాపాడుతాననే మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకుంటున్నారని కాదంబరి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన 40 వేల మంది సినీ కార్మికుల కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపిందని కాదంబరి కిరణ్ అన్నారు. అయితే చిత్ర పరిశ్రమకు కేటాయించే 1500 ఎకరాల్లో కొంత స్థలాన్ని కార్మికుల నివాసాల కోసం కేటాయించాలని కాదంబరి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్ లోని ఫిలింఛాంబర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి అయ్యాక సీఎం కేసీఆర్ చెప్పిన తొలి మాట సినిమా…

Read More