టి-సాట్ యాప్ 10 లక్షల డౌన్ లోడ్ లు

టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మరో మైలు రాయిని దాటాయి. అనతి కాలంలోనే అనేక అద్భుతాలు సృష్టించిన టి-సాట్ మరో అద్భుతానికి వేదికైంది. టి-సాట్ యాప్ 10 లక్షల (వన్ మిలియన్ ) డౌన్ లోడ్ లు కావడంతో సంబంధిత శాఖ మంత్రి కె.టి.రామారావు అభినందించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్ లోనూ కొనసాగించాలని అధికారులకు సూచించారు. టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల యాప్ పది లక్షల డౌన్ లోడ్ లు కావడంతో బుధవారం ఐటి, మున్సిపల్ శాఖా మాత్యులు కె.టి.రామారావు ను తన క్యాంపు కార్యాలయంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్ అధికారులతో కలిసి మొబైల్ ను ప్రదర్శిస్తూ అభినందనలు తెలిపారు. విద్యార్థులకు కష్ట కాలంలో టి-సాట్ యాప్…

Read More