వి.వినాయ‌క్ రిలీజ్ చేసిన `రాధాకృష్ణ` చిత్రంలోని `తంగేడు పువ్వు` లిరిక‌ల్ వీడియో సాంగ్‌

“తంగేడు పువ్వులాంటి  నా బుగ్గ‌మీద నా సిందూరం పూసిండే  సిల‌కో… గుళ్ళోన గంట‌లాంటి నా గొంతు మీద‌నా మౌనాలు చ‌ల్లిండే మొల‌కో..నీలాల క‌న్నుల్లో మెరుపున్నోడే మేఘాలపై నుంచి ఉరికొచ్చిండే..“అంటూ సాగే `రాధాకృష్ణ` చిత్రంలోని ఈ ఆహ్లాద‌క‌ర‌మైన పాటని సంగీత ద‌ర్శ‌కురాలు ఎమ్.ఎమ్ శ్రీ‌లేఖ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా.. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్  మాట్లాడుతూ – “ నా స్నేహితుడు శ్రీ‌నివాస‌రెడ్డి గారి నేతృత్వంలో తెర‌కెక్కుతోన్న మూవీ `రాధాకృష్ణ`.  తెలంగాణలో నిర్మ‌ల్ ప్రాంతం బొమ్మ‌ల‌కు చాలా ఫేమ‌స్‌, అక్క‌డి నిర్మ‌ల్ బొమ్మ నేప‌థ్యంలో ఒక మంచి ల‌వ్ స్టోరీని అళ్లి తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ వ‌ర్మ‌. ప్ర‌సాద్ వ‌ర్మ‌కి శ్రీ‌నివాస‌రెడ్డి గారి ద‌గ్గ‌ర ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. నిర్మ‌ల్ ప‌రిస‌ర ప్రాంతాలు,  కుంటాల లాంటి  అంద‌మైన లొకేష‌న్స్ లో అద్భుతంగా…

Read More