ఫుడ్‌ ప్రాససింగ్‌పై క్యాంపు కార్యాలయంలో సీఎం సమావేశం

అరటి, చీనీ, టమోటా లాంటి రైతులు ప్రతి ఏటా తీవ్ర ఆందోళన చెందుతున్నారు: సీఎంకనీస గిట్టుబాటు ధరలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారురైతులు పండించిన పంటను అమ్మకునేందుకు కష్టాలు పడకూడదు:సంబంధిత పంటల విషయంలో ఫుడ్‌ప్రాససింగ్‌ను ప్రోత్సహించాలి:దీనికోసం ప్రత్యేక శ్రద్ధపెట్టాలి: వచ్చే సీజన్‌ కల్లా ఫుడ్‌ప్రాససింగ్‌కు ఏర్పాట్లు చేయాలి:రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే… ఎంతమేర కొనుగోలు చేయాలి, ఎంతమేర ఫుడ్‌ప్రాససింగ్‌కు తరలించాలన్నదానిపై అధికారులు దృష్టిపెట్టాలి:దీనికోసం ఖర్చు ఎంత అయినా పర్వాలేదు.. కాని సమస్యకు పరిష్కారం ఉండాలి:ప్రతి ఏటా అరటి, చీనీ, టమోటా, ఉల్లి, నిమ్మలాంటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ కథనాలు వస్తున్నాయి:మళ్లీ ఇలాంటి కథనాలు కనిపించకూడదు:ప్రతి ఏటా ఇలాంటివి పునరావృతం కాకూడదు:మిల్లెట్స్‌ ప్రాససింగ్‌పైన కూడా దృష్టిపెట్టండి….:ఫుడ్‌ ప్రాససింగ్‌పై ప్రఖ్యాత కంపెనీలతో టై అప్‌ చేసుకోవాలి:లన్న సీఎంఇబ్బందులు వస్తున్న 7–8 పంటలను గుర్తించండి…:వాటిని ప్రాససింగ్‌ చేసి… వాల్యూ ఎడిషన్‌ ఏం చేయగలమో…

Read More

వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుపెట్టుకోం. వైఎస్ జగన్

గత ఎన్నికల్లో మాదిరే వచ్చే ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తుపెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో ఆయన మాట్లాడుతూ, ‘హోదా’పై ఎవరు సంతకం పెడతారో వారికే తమ మద్దతిస్తామని మరోసారి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 25కు 25 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓటు వేయొద్దని సూచించారు. ఓటు వేయమని చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోమని, ఓటు మాత్రం మనస్సాక్షి చెప్పినట్టు వేయాలని వ్యాఖ్యానించారు. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, అలాగే, వైసీపీ అధికారంలోకి రాబోతోందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Read More