తెలుగు న‌వ‌ల‌ని.. హాలీవుడ్ నిర్మాణ సంస్థ కొనుగోలు!

ప్రముఖ తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆనందో బ్రహ్మ నవల సినిమా హక్కులను అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ తెలుగు దర్శక నిర్మాత ముక్తేశ్‌ రావు మేక‌ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు హాలీవుడ్ సినిమాలు నిర్మిస్తున్న ఆయన ఆనందో బ్రహ్మ నవలను తెరకెక్కించే ఆలోచనలో హక్కులు సొంతం చేసుకున్నారు. 1729 పిక్చ‌ర్స్ హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ మీద‌ ఈ సినిమాను నిర్మిస్తున్న‌ది. మనుషుల మధ్య సంబంధాలను, ఆత్మీయానుబంధాలను పలికించిన ఈ నవల త్వరలో చిత్రరూపంలో తెరపై అలరించనుంది. ఓం పల్లెటూరి యువకుడు పట్నం వస్తే.. అతడిని ఓ గృహిణి సేద తీరుస్తుంది. వారిద్దరి మధ్య ఉన్నది ఏంటి? ప్రేమా? ఆకర్షణా? అనుబంధమా? సెక్సా? అనే ఆకట్టుకునే కథనంతో యండమూరి ఈ నవల అల్లారు. ఆత్మీయానుబంధాల కలబోతగా కల ఈ నవలను…

Read More