టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కల్లూరుకు చెందిన కె. సత్యనారాయణ శెట్టి సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చారు. పోసాని కృష్ణమురళీ, మహేశ్ అనే వ్యక్తులు వైసీపీ ప్రభుత్వం హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గచ్చిబౌలిలో కేసు పెట్టినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పారు. డబ్బులు మోసపోవడంతో ఐదేళ్లనుండి తన …
Read More »పిట్ట కొంచెం.. కూత ఘనం.. సీఎం నారా చంద్రబాబు మనుమడు రికార్డును తిరగ రాసిన బుడుతడు..
బాలల మేధో వికాసానికి చదరంగం ఎంతో దోహదపడుతుంది. ఈ చదరంగంలో కొందరు బాలలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు ఓ బుడతడు.180 బోర్డులపై వేగంగా పావులు కదుపుతూ 5,334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఇన్ లాస్లో పోల్గారు ను విజయవంతంగా పూర్తి చేసి నోబెల్ ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించాడు. అయితే ఈ రికార్డు ఇప్పటి వరకూ ఓ సీఎం మనవడి పేరిట ఉండగా.. ఆ రికార్డును తిరగరాశాడు …
Read More »తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ.. పెళ్లుబికిన ఆగ్రహం
తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని శ్రీరాములు జయంతి సందర్భంగా కేంద్ర బండి సంజయ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు. అలాంటి మహనీయుని పేరును తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు..ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు త్వరలో మారనుంది. బదులుగా ప్రముఖ తెలంగాణ కవి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును ఆ …
Read More »ఎండలు మండిపోతున్నాయ్ బాబోయ్.! ఏయే జిల్లాల్లో అత్యధికం అంటే.?
మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.? వాతావరణశాఖ హెచ్చరికలు ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర …
Read More »డేంజర్ బెల్.. ప్రమాదకర స్థాయికి యూవీ ఇండెక్స్.. ఆ సమయాల్లో బయటకు రావొద్దు..
భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే… క్యాలెండర్ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్‌తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది…?వేసవి కాలం హడలెత్తిస్తోంది.. ఈసారి ఫిబ్రవరి నుంచే ఫుల్ ఫైర్ మీదున్నాడు భానుడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే దంచికొడుతున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు.. పొగలు కక్కుతుందంటే …
Read More »తెలంగాణలో డీలిమిటేషన్ సెగలు.. కాంగ్రెస్ వ్యూహంపై బీఆర్ఎస్, బీజేపీ రియాక్షన్ ఇదే..p
డీలిమిటేషన్ అంశం.. తమిళనాడులోనే కాదు.. తెలంగాణలోనూ సెగలు పుట్టిస్తుంది. అఖిలపక్షంలో చర్చిద్దామని.. కాంగ్రెస్ అంటుంది. తమిళ రాజకీయ ట్రాప్‌లో పడ్డారని.. కమలం పార్టీ కస్సుబుస్సులాడుతున్న వేళ.. అసలు అఖిలపక్షం జరిగేదెప్పుడు.. వెళ్లేది ఎవరు?. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి..? డీలిమిటేషన్‌పై దక్షిణాది జంగ్ సైరన్ మోగిస్తున్న వేళ.. తెలంగాణకు కూడా ఈ సెగలు తాకాయి. డీలిమిటేషన్ పై అఖిలపక్షం నిర్వహిస్తామని అధికార కాంగ్రెస్ అంటుంది. 22న స్టాలిన్ భేటీ కంటే ముందే తెలంగాణలో అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. కానీ.. మీటింగ్ ఎప్పుడు ఉంటుందో …
Read More »తెలంగాణకు మరో యునెస్కో గుర్తింపు..! నారాయణపేట ముడమాల్ నిలువురాళ్లకు ఆ జాబితాలో చోటు..
ప్రపంచ వారసత్వ ప్రదేశం ట్యాగ్ కోసం ప్రతిపాదనను ఇప్పటికే భారత పురావస్తు సర్వేకు పంపారు. ముడుమాల్ లో ఉన్న ఈ నిలువురాళ్లు ఆదిమ మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశోధకులు చెబుతున్నారు. శిలాయుగంలోనే వాతావరణ మార్పులు, రుతువులు, కాలాలను గుర్తించడానికి ఆదిమ మానవులు ఏర్పాటు చేసుకున్నట్టు చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నారాయణపేటలోని ముడుమల్ గ్రామంలోని 3,000 సంవత్సరాల పురాతన మెగాలిథిక్ మెన్‌హిర్స్ స్థలాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం భారతదేశం నుండి తాత్కాలిక జాబితాలో చేర్చింది. భవిష్యత్తులో దేశాలు …
Read More »తీగలాగితే డొంక కదులుతోంది.. ఇకపై ఆటలు సాగవంటున్న సైబర్ పోలీసులు!
సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు..తెలంగాణ పోలీసులు. దీంతో కలుగులో దాక్కున్న సైబర్ కేటుగాళ్లు..పట్టుబడుతున్నారు.సైబర్ కేటుగాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.. తెలంగాణ పోలీసులు. ఆన్‌లైన్ ఫ్రాడ్స్‌పై ఓవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే..మరోవైపు నేరాలకు పాల్పడుతున్నవారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు..గత రెండు నెలల వ్యవధిలో 161 మంది సైబర్ నేరగాళ్లను …
Read More »ఎమ్మెల్యేకు తప్పని న్యూడ్ కాల్ బెదిరింపులు.. సైబర్ నేరగాళ్లతో వీరేశం పరేషాన్!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల అమాయకులనే కాదు ప్రజా ప్రతినిధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేపై అశ్లీల వీడియో కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేశారు. నల్లగొండ జిల్లా నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సెల్‌ఫోన్‌లోకి చొరబడి సైబర్ ఎటాక్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్‌లో నుండి ఫోటోలను సేకరించిన సైబర్ క్రిమినల్స్.. …
Read More »కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం తెలిపామా..? తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు
తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కృష్ణానది, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుందంటూ తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అభ్యంతరం తెలిపలేదని.. వృధా నీటిని ఉపయోగించుకుంటున్నామని వివరించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరింది.. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి …
Read More »