Masonry Layout

ఐఏఎస్‌లకు హైకోర్టులో చుక్కెదురు.. ఏపీలో రిపోర్టు చేయాల్సిందే, రిలీవ్ చేయనున్న తెలంగాణ

కేంద్రం ఇటీవల బదిలీ చేసిన ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఏడుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి కాటా, వాణీప్రసాద్, హరి కిరణ్, శివశంకర్, సృజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని స్పష్టం …

Read More »

ముంబయి- న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్తోన్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపుల రావడంతో దానిని న్యూఢిల్లీకి మళ్లించారు. సోమవారం ఉదయం ముంబయి నుంచి 239 మంది బయలుదేరిన ఎయిరిండియా విమానం.. న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమానాన్ని ప్రత్యేకంగా ఓ రన్‌వేపై నిలిపి.. భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ‘‘ముంబయి నుంచి న్యూయార్క్‌లో జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి అక్టోబరు 14న ఉదయం బయలుదేరిన …

Read More »

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత

Ratan Tata Expired: ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. వయోభారంతో గత కొన్ని రోజులుగా ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా.. బుధవారం (అక్టోబర్ 09న) రోజు రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా.. ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే.. రతన్ టాటా పరిస్థితి పూర్తిగా విషమించటంతో చికిత్స పొందుతూనే …

Read More »

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం.. కుమార్తె గాయత్రి కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం.. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రస్తావించారు. ఓ …

Read More »

దుర్గగుడిలో శరన్నవరాత్రి వేడుకలు.. దర్శనం వేళల వివరాలివే!

దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దసరా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఠక్కున గుర్తొచ్చే దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి. విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. గురువారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఇక ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రారంభమయ్యే ఉత్సవాలు పది రోజుల …

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.. డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం, గదులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెల కోటా.. అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుంది. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి టీటీడీ డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను విడుదల చేస్తుంది. అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు.. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా.. డిసెంబర్ నెల ఉచిత‌ …

Read More »

తిరుమల శ్రీవారే నాతో నిజాలు చెప్పించారు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

 తిరుపతి లడ్డూ తయారీ గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తాజాగా మరిన్ని విషయాలు వెల్లడించారు. శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారాన్ని ఆయనే తనతో చెప్పించారని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందని తెలిపారు. ఇక నుంచి భవిష్యత్తులో ఇలాంటి కల్తీ ఘటనలు జరగకుండా.. తప్పు చేసినవారిని కఠినంగా శిక్షిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఈ విషయం విని తీవ్ర …

Read More »

ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్లు.. ఈసారి ముందుగానే, కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శాఖలవారీగా ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ మేరకు విద్యాశాఖపై మంత్రి లోకేష్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అవసరమైన చోట్ల మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్కూల్ విద్యార్థులకు కొత్త యూనిఫామ్ ఇవ్వాలని భావిస్తున్నారట.. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్‌ను వచ్చే ఏడాది నుంచి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. యూనిఫామ్ మాత్రమే కాదు.. బ్యాగ్, షూ, బెల్టులలో నాణ్యత …

Read More »

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ మెచ్చిన సర్పంచ్ .. ఎవరీ కారుమంచి సంయుక్త?

Pawan kalyan at Swarna Grama Panchayat in Mysooravariapalli:ఏపీలోని సుమారు 13వేలకు పైగా పంచాయతీలలో ఇవాళ (ఆగస్ట్ 23వ తేదీన) గ్రామసభలు జరిగాయి. ఒకేరోజు ఈ స్థాయిలో గ్రామసభల నిర్వహణ దేశంలోనే ఇదే తొలిసారి. ఇక ఈ సంబరంలో పాల్గొనేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అన్నమయ్య జిల్లాకు వెళ్లారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లె గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కారుమంచి సంయుక్త మీద పవన్ కళ్యాణ్ …

Read More »

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల కోసం తమిళనాడు భక్తుల అతి తెలివి.. చివరి నంబర్లు మార్చి, ప్లాన్ రివర్స్

తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్‌లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దర్శనం కోసం దళారులను ఆశ్రయించి తమ దర్శన టికెట్లు నష్టపోవద్దని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. గురువారం ఉదయం తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారు. వీరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు …

Read More »